DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారు: బివి రామ్

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 13,  2021 (డిఎన్ఎస్):*  వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో  నిరంకుశత్వం గా  వ్యవహరిస్తోందని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆరోపించారు. అమరావతి ని ఏకైక రాజధాని గా కొనసాగించాలని  ఆకాంక్షిస్తూ  రైతులు,మహిళలు చేపట్టిన "

న్యాయస్థానం టు దేవస్థానం " పాదయాత్రకు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ప్రకాశం జిల్లా ఎర్రజర్లలో శనివారం ఉదయం సంఘీభావం తెలిపారు.  ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. రైతులు, మహిళలు చేస్తున్న ఈ మహాపాదయాత్ర మీ కోసం... నా కోసం కాదు.... ఐదు కోట్ల మంది ప్రజల కోసం చేస్తున్నారు. నాడు స్వతంత్రం కోసం ఎలాగైతే బ్రిటిష్ వారిపై

పోరాటం చేశారో అదే స్ఫూర్తితో నేడు చేస్తున్న ఈ మహాపాదయాత్ర రాష్ట్ర ప్రభుత్వం పై విజయం సాధిస్తుందని అంతిమంగా అమరావతి గెలుస్తుందని రామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పాదయాత్ర కొనసాగడాన్ని జీర్ణించుకోలేని ప్రభుత్వం ఎన్నికల కోడ్ పేరుతో బ్రేక్ వేయడం ఎంత వరకు సమంజసమని

ప్రశ్నించారు. 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న వైసీపీ స్థానిక ఎన్నికల కోసం కూడా తాపత్రయ పడి.. పాదయాత్రకు ఎన్నికల కోడ్ నెపంతో అడ్డుకుందన్నారు. మరో వైపు పోలీసులు కూడా అత్యుత్సాహం చూపుతున్నారని, ప్రభుత్వ మెప్పుకోసమే శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న వారిపై లాఠీఛార్జ్  చేశారన్నారు. ఏది ఏమైనా దేశ స్వాతంత్ర పోరాటం

మాదిరిగా "ఏకైక రాజధాని" అమరావతి అనే సంకల్పంతో కొనసాగిస్తున్న ఈ మహాపాదయాత్ర కు అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న ఆదరణను తట్టుకోలేకనే.. ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రజలు మూడు రాజధానులను కోరుకోవడం లేదని అన్నారు .  రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ శాతం మంది ప్రజలు అమరావతిని ఏకైక

రాజధానిగా  కోరుకుంటున్నారని అన్నారు.

సింహాలై చూపాలి తెలుగుజాతి పౌరుషం మన రాష్ట్రం నాశనం చేయాలని చూసే ప్రతి ఒక్కరిని పాతాళంలోకి తొక్కే లన్ని ప్రకాశం జిల్లా సాక్షిగా 5 కోట్ల మంది ప్రజలకు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ పిలుపునిచ్చారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam