DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ దేవాదాయశాఖ డీసీగా శ్రీనివాస రెడ్డి నియామకం

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 13,  2021 (డిఎన్ఎస్):* విశాఖ జిల్లా దేవాదాయ శాఖా ఉప కమిషనర్ గా నెల్లూరు జిల్లా రాజ రాజేశ్వరి అమ్మవారి ఆలయం, అసిస్టెంట్ కమీషనర్ & ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వి. శ్రీనివాస రెడ్డి ని నియమిస్తూ దేవాదాయ శాఖా ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరు ఆలయానికి అదనంగా ఈ విధులను నిర్వహించాల్సి

ఉంది.  అన్ని అత్యవసర పరిస్థితులకు హాజరు కావడానికి నెల్లూరు శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అందుబాటులో ఉండాలని తెలిపింది.

ప్రస్తుతం విశాఖ డీసీ గా అదనపు భాద్యతలు వహిస్తున్న శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం, సింహాచలం, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,  ఎం.వి.సూర్యకళ నుంచి బాధ్యతలు తీసుకోవాలని

తెలిపింది. 

గతంలో డీసీ గా ఉన్న పుష్పవర్ధన్ పై పలు వివాదాలు రావడంతో అతన్ని పదవీచ్చుతుణ్ణి చేస్తూ బదిలీ చేయడంతో ఖాళీగా ఉన్న విశాఖ డీసీ గా అదనపు bhadyatalanu సింహాచలం దేవస్థానం ఈఓ సూర్యకళకు ఆ భాద్యతలు అప్పగించారు. 
  

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam