DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మీడియా ఇళ్ల పథకాలకు ఆన్ లైన్ ప్రక్రియ రెండు రోజుల్లో: మంత్రి కాలవ

శ్రీకాకుళం, ఆగస్టు 6 , 2018 (DNS Online ): రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మీడియా సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న అక్రిడైటెడ్ పాత్రికేయులకు కేటాయించిన గృహ నిర్మాణ పధకానికి ఆన్

లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ మరో రెండు, మూడు రోజుల్లో ప్రారంభం అవుతుందని ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖా మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రకటించారు. దేశంలోని మరే ఇతర

 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో లేని విధంగా మన రాష్ట్రంలో జర్నలిస్టులకు పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. శ్రీకాకుళం లో ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల

శిక్షణా తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల మధ్య పలు అంశాల్లో సారూప్యత ఉందని, వెనుకబాటు తనం, పేదరికం వంటి

అంశాల్లోను, భౌగోళికంగా సారూప్యత ఉందన్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సహజ వనరులు సమృద్ధిగా వున్నా వాటిని వినియోగించుకోలేక పోవడం

వల్లే వెనుకబాటుతనం ఉందని తెలిపారు. ఈ జిల్లాల్లో వెనుకబాటుతనానికి ముగింపు పలకాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందుకే ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం

జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందన్నారు. 
సమాచార రంగంలో వస్తున్న ఆధునిక పోకడలను జర్నలిస్టులకు పరిచయం చేసి

వారిలో అవగాహన పెంపొందించేందుకే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలియచేసారు. జర్నలిస్టులు వాస్తవాలనే వార్తలుగా అందించాలి, వాస్తవాలు రాసే

జర్నలిస్టులే ప్రభుత్వానికి మిత్రులుగా పరిగణించబడతారని చూచాయగా హెచ్చరించారు. à°…ంతకు ముందు శ్రీకాకుళం పర్యటన నిమిత్తం సోమవారం వచ్చిన ఆయనకు విశాఖ

విమానాశ్రయం లో à°† శాఖా అధికారులు ఘన స్వాగతం పలికారు. కాసేపు  à°…నంతరం రోడ్డు మార్గం ద్వారా శ్రీకాకుళం చేరుకున్నారు. శ్రీకాకుళంలో జరిగిన పలు అభివృద్ధి

కార్యక్రమాల్లో సమాచార శాఖా మంత్రి కాలవ శ్రీనివాసులు తో కలిసి రవాణా శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.అరసవల్లిలో పి.ఎం.ఏ.వై. పట్టణ గృహాలకు

శంకుస్థాపన చేశారు. à°ˆ కార్యక్రమంలో à°Žà°‚.ఎల్.ఏ. గుండ లక్ష్మీ దేవి, జెడ్పి చైర్మన్ చౌదరి ధనలక్ష్మి, సమాచార శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్, ప్రెస్ అకాడమీ కార్యదర్శి

à°¡à°¿.శ్రీనివాస్, సమాచార శాఖ జె.à°¡à°¿. కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns #dnsnews #dns news #dnslive #dns live #dnsmedia #dns media #vizag #visakhapatnam #visakhapatnam airport #airport #srikakulam #arasavilli  #press council #journalists #journalists housing scheme #andhra pradesh government #minister for ipr #kalava srinivas
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam