DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంతరాష్ట్ర సమస్యల పరిష్కారం కై  కమిటీ వెయ్యాలి: ఏపీ సీఎం 

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  
 
*అమరావతి, నవంబర్ 14,  2021 (డిఎన్ఎస్):* రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలని, దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.  తిరుపతి లో జరుగుతున్న 
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి

సమావేశనికి కేంద్రం హోమ్ శాఖామంత్రి అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..

విభజనతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదన్నారు. 

సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటితో

రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతోందన్నారు.

పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం. ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు.

రీసోర్స్‌ గ్యాప్‌నూ భర్తీచేయలేదు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదన్నారు.

తెలంగాణ నుంచి విద్యుత్‌ బకాయిలను ఇప్పించాలని

కేంద్ర హోమ్ మంత్రి ని కోరారు.

తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట నివ్వండని కోరారు. 

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదన్నారు.

గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలని

విన్నవించారు.

రాష్ట్రాల్లో రేషన్‌ లబ్ధిదారుల గుర్తింపుకోసం కేంద్ర ప్రభుత్వ ప్రక్రియలో హేతుబద్ధత లేదు. వెంటనే సవరణలు చేయాలన్నారు.

ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ ఆతిథ్యం ఇవ్వగా.. సీఎం జగన్‌ లాంఛనంగా సమావేశాన్ని ప్రారంభించారు..

ఈ సమావేశంలో తెలంగాణ తరపున గవర్నర్ తమిళశై, ఇతర దక్షిణ భారత

రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam