DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అరుణాచల కృత్తికా దీప దర్శనం జన్మ జన్మల పుణ్యఫలo

*19 న అరుణాచల పుణ్యక్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా.*

*(DNS Report : Arunachala Sharma., Arunachalam )*

*అరుణాచలం / విశాఖపట్నం, నవంబర్ 16,  2021 (డిఎన్ఎస్):* ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం తమిళనాడు లోని తిరువణ్ణామలై అరుణగిరి శిఖరాలపై  కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగే అత్యంత వైభవంగా జరిగే మహా దీప వేడుకలకు

కృత్తికా దీపోత్సవం అని పేరు. ఈ నెల 19 న జరిగే ఈ మహా కార్తీక దీపం ప్రజ్వలన వేడుకలపై ప్రత్యేక కథనం. 

అరుణాచలేశ్వరుడే జ్యోతి రూపంలో దర్శనమిచ్చే ఏకైక పుణ్యక్షేత్రం అరుణాచలం. జన్మ జన్మల పాపరాశులను భస్మం చేసే శివజ్యోతి గా భావించి భక్తులు అమితానందాన్ని పొందుతుంటారు. 

దీపనాడార్ వంశస్థులు ఆనవాయతీగా

తీసుకువచ్చిన 600 మీటర్ల తాను గుడ్డను దీపపు వత్తిగా చేసి భక్తులు తెచ్చిన 2500 కెజిల ఆవు నెయ్యిలో నాన బెట్టి కార్తీక దివ్య దీపం వెలిగిస్తారు.

ఆ మహా పుణ్య క్రతువుకు.. సిద్ధమైన దీప కొప్పెరలను వినియోగించడం జరుగుతుంది. 

అరుణాచల మహా దీపం వెలిగించే ప్రక్రియ ఇది తమిళులకు కార్తీక మాసము, కార్తీక మాసములో

కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున శ్రీ అరుణాచల గిరిపైన మహా జ్యోతిని ప్రజ్వలింపజేస్తారు. దీనినే " కృత్తికా దీపోత్సవం " అంటారు.

ఈ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిద ఇలా రాగితో చేయబడుతుంది. ఇందులో వత్తిగా వెలిగించే వస్త్రం 600 మీటర్లతో చేయబడుతుంది. ఈ ప్రమిదను, వత్తిని " జ్యోతి నాడార్ లేక దీప నాడార్ "

అని పిలువబడే వంశస్తులు మాత్రమే అందజేస్తారు. ఇక 2500 కిలోల నెయ్యి భక్తులు అందజేస్తారు.  అలా వెలిగించిన అరుణాచల మహా దీపం మూడు రోజులు దేదీప్యమానంగా వెలుగుతుంది.  సుమారు 24 కిలోమీటర్ల మేరకు ఈ దీపము దర్శనమిస్తుంది.

సాధారణంగా గిరులపై ఆలయాలు ఉంటాయి.. కానీ ఆ పర్వతమే ఓ మహాలయం... అదే పరమ పావనం, దివ్యశోభితమైన అరుణగిరి.

భక్తులు మహాదేవుడిగా భావించినా, రమణులు ఆత్మ స్వరూపంగా దర్శించినా ఈ గిరి ఔన్నత్యం అనంతం. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపంగా భావించి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య అసంఖ్యాకం. అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన మహా క్షేత్రం కార్తిక పౌర్ణమినాడు దేదీప్యమానంగా వెలుగుతుంది.

ఏమిటీ అరుణాచలం: . . తమిళనాడులోని

తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి.  అగ్ని లింగేశ్వరుడుగా ఆదిదేవుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. ‘స్మరణాత్‌ అరుణాచలే’ అంటారు. అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు. వైష్ణవులు పరమపావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా భువిపై

సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం. తిరువణ్ణామలై అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం. అరుణగిరి రుణానుబంధాల్ని హరించివేస్తుందని అరుణాచల మహాత్మ్యం పేర్కొంది. స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యం ఈ క్షేత్ర ప్రశస్తిని, గిరి వైభవాన్ని విశేషంగా వర్ణించింది.

అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరతాయని నానుడి. ఇక్కడ

రుణాలు తీరడమంటే బంధనాల నుంచి విడివడి ముక్తిమార్గం వైపు పయనించడం. కైలాసంలో ఉన్న శివ మహాదేవుడు నిరంతరం తపోదీక్షలో కొనసాగుతుంటాడు. ఆయన ధ్యానానంతరం కళ్లు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు. 
సదాశివుని శుభమంగళ వీక్షణాలతో అరుణాచలం సదా పులకితయామినిగా పరిమళిస్తుంది. 
అగ్ని లింగమై పరంజ్యోతి

స్వరూపుడిగా దర్శనమిచ్చే శివుడు ఈ గిరి రూపంలో విరాట్‌ రూపాన్ని సంతరించుకున్నాడు. ‘ఎవరెన్ని మార్గాల్లో సంచరించినా చివరికి అందరి గమ్యం అరుణాచలమే’ అనేది తమిళనాట జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న సందేశం.

అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది. కృత యుగంలో దీన్ని అగ్ని పర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని,

ద్వాపరంలో తామ్ర శైలమని వ్యవహరించారు. 
కలియుగాన శిలాశోభితమైన గిరి ఎన్నో రహస్యాల్ని తనలో నిక్షిప్తం చేసుకుంది. అరుణాచలం 260 కోట్ల సంవత్సరాల నాటిదని ప్రఖ్యాత పురాతత్త్వ శాస్త్రవేత్త బీర్బల్‌్ సహాని నిర్థరించారు.
 ఈ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవని, ఈ కొండపై ఉన్న మట్టిలో అనేక ఔషధీగుణాలున్నాయని

శాస్త్రీయంగా నిర్థరించారు. గౌతముడు, అగస్త్య మహర్షి ఈ గిరిని శోణాచలమన్నారు. 43 కోణాల్లో శ్రీచక్రాకారంలో ఉండే ఈ పర్వతం శ్రీచక్రత్తాళ్వార్‌కు స్థాణువు రూపంగా వైష్ణవాగమాలు ప్రకటించాయి. జగద్గురువు ఆది శంకరాచార్యులు ఈ కొండను మేరువు గిరి అన్నారు. భగవద్రామానుజులు అరుణాచలాన్ని మహా సాలగ్రామంగా దర్శించారు..

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam