DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేంద్రమంత్రి గా ఉన్నప్పడికీ వైద్యునిగా భాద్యత విస్మరించలేదు

*మా హృదయంలో నిలిచారు: కరద్ కు ప్రధాని మోడీ ప్రశంసల జల్లు* 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 17,  2021 (డిఎన్ఎస్):* వృత్తి రీత్యా వైద్యులు అయినా డాక్టర్ భగవత్ కరద్ ప్రస్తుతం నరేంద్ర మోడీ క్యాబినెట్ లో  కేంద్ర ఆర్ధిక శాఖా సహాయ మంత్రి గా విధులు నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పడికి

వైద్యునిగా తన భాద్యతలను ఆయన విస్మరించలేదు. దీనికి నిదర్శనమే. . . ఇండిగో విమానంలో ఒక ప్రయాణీకునికి అత్యవసర వైద్య సహాయం అందించడమే. మంగళవారం జరిగిన ఈ ఘటనకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సేవతో మీరు మా హృదయంలో నిలిచారు అంటూ సహచర మంత్రి డా. కరద్ కు ప్రధాని మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. 

నివేదికల ప్రకారం,

మంత్రి భగవత్ కరద్ ఇండిగో విమానం 6E171 నుండి ఢిల్లీ నుండి ముంబైకి ప్రయాణిస్తున్నారు. టేకాఫ్ అయిన ఒక గంట తర్వాత, ఒక ప్రయాణీకుడు అసౌకర్యం గురించి ఫిర్యాదు చేయడం ప్రారంభించాడు.

ప్రయాణీకుడు ఫిర్యాదు చేయడంతో, క్యాబిన్ సిబ్బంది వెంటనే విమానంలో ఎవరైనా వైద్యులు ఉన్నారా అంటూ పిలుపు ఇవ్వడంతోనే వృత్తిరీత్యా సర్జన్

అయిన భగవత్ కరద్ సహాయం కోసం పరుగెత్తారు. అతను ప్రాథమిక వైద్య సహాయాన్ని అందించారు. విమానం యొక్క ఎమర్జెన్సీ కిట్‌లో అందుబాటులో ఉన్న ఇంజెక్షన్‌ను కూడా అందించారు.

ప్రయాణం ముగిసిన తర్వాత డా. కరద్ మాట్లాడుతూ ప్రయాణికునికి విపరీతంగా చెమటలు పట్టాయి, బిపి తక్కువగా ఉంది. అతని బట్టలు తీసివేసి, అతని కాళ్ళను పైకి

లేపి, అతని ఛాతీకి రుద్దాను, తర్వాత గ్లూకోజ్ ఇచ్చాను. ఒక 30 నిమిషాల తర్వాత అతను బాగుపడ్డాడు" అని కరాద్ చెప్పారు.

వైద్యునిగా తోటి ప్రయాణీకునికి కేంద్ర మంత్రి డాక్టర్ భగవత్ కరద్ చేసిన సహకారానికి ఎయిర్‌లైన్ అధికారిక ట్విట్టర్ మంత్రికి తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ, "ఆయన విధులను నాన్‌స్టాప్‌గా

నిర్వర్తించినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు, హృదయపూర్వక అభినందనలు తెలియచేసింది.  

కేంద్ర మంత్రివర్గ సహచరులు, బీజేపీ నేతలు, తోటి ప్రయాణీకులు, నెటిజన్లు, అందరూ కేంద్ర మంత్రి కి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam