DNS Media | Latest News, Breaking News And Update In Telugu

19  నుంచి తిరుక్కర్తే, గుళ్ళల్లో నాలాయిర ప్రబంధ పఠనం ఉండదు

*శ్రీరంగం, తిరుపతి సహా, వైష్ణవ గుళ్ళల్లో ఆరాధన పాశురాల్లో మార్పు*

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 18,  2021 (డిఎన్ఎస్):* ఈ నెల 19 నుంచి జనవరి 23 వరకూ తిరుక్కర్తే కొనసాగుతుంది. శ్రీవైష్ణవ సంప్రదాయం లో ఈ రోజుల్లో వైష్ణవ దేవాలయాలు, సంప్రదాయ గృహాల్లో కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం ఆనవాయితీగా

వస్తోంది. సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నాలాయిర దివ్య ప్రబంధం గ్రంధాలను ఆలయాల్లోనూ, ఇళ్లలోనూ పఠించడం ఉండదు. 

మొత్తం 12 మంది ఆళ్వార్లు శ్రీమన్నారాయణుని వైభవాన్ని కీర్తిస్తూ ఆయన స్వయంభూ గా వెలసిన దివ్య దేశ ఆలయాలను వర్ణిస్తూ తమిళ భాషలో చేసిన రచనలకు పాశురాలు అని పేరు. అవి 4000 ఉన్నాయి. నాల్ అంటే నాలుగు, ఆయిరం

అంటే వెయ్యి, మొత్తం నాలుగు వేలు కనుక నాలాయిరం అని పేరు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఉన్నవారు తప్పనిసరిగా ఈ ప్రబంధాన్ని నేర్చుకోవాల్సి ఉంది. కారణాంతాల వల్ల ప్రస్తుతం కొందరే వీటిని నేర్చుకోవడం జరుగుతోంది. ఆలయాల్లో అర్చనలు చేసే వారికి తప్పని సరిగా వచ్చి ఉండాలి.  శ్రీరంగం, తిరుమల, సింహాచలం, భద్రాచలం, సహా అన్ని శ్రీవైష్ణవ

క్షేత్రాల్లో ఈ నియమాలను పాటిస్తారు. 

తిరుమంగైయాళ్వార్ తిరునక్షత్రం నుంచి కూరత్తాళ్వాన్ తిరునక్షత్రం వరకూ మద్య ఉన్న కాలేయాన్ని తిరుక్కర్తే గా పరిగణించడం జరుగుతుంది. వైష్ణవ క్షేత్రాల్లో ఆళ్వార్లకు అత్యంత విలువల ఇచ్చి, ఆలయాల్లో వీరికి ప్రత్యేక ఆరాధనలు, ఉత్సవాలు కూడా జరపడం ఆచారం. మొత్తం 12 మంది

ఆళ్వార్లలో బ్రాహ్మణా సంప్రదాయానికి చెందిన వారు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు, మిగిలిన వారంతా ఇతర వర్ణాలకు చెందిన వారే. అయినప్పటికీ వాళ్లకి ఆలయంలో మూల విరాట్ సన్నిధిలో విగ్రహాలను ఏర్పాటు చేసి, మరీ ఆరాధనలు ఆచరించడం కేవలం శ్రీవైష్ణవ సంప్రదాయంలో మాత్రమే ఉంది. సమాజంలో అందరూ స్వామి పిల్లలేనని భగవద్రామానుజాచార్యులు

వెయ్యేళ్ళ క్రితమే నిరూపించారు.    

ఈ సంప్రదాయంలో నవంబర్ 19 నుంచి శ్రీవైష్ణవ ఆలయాల్లో ప్రబంధ నిగమనం అంటే. . .నిత్యం సమయం ప్రకారం జరిగే నాలాయిర పాశురాలను ఆలపించడం ఉండదు. 
ఈ గ్రంధాన్ని ఇళ్లల్లో కూడా పారాయణ చేస్తుంటారు సంప్రదాయపరులు. ఈ నెల 20 నుంచి గృహాల్లో ఈ పారాయణ నిలిపి వేయడం

జరుగుతుంది. 

తిరిగి జనవరి 23 నుంచి తిరుక్కర్తే ముగింపు అనంతరం ఆలయాల్లోనూ, గృహాల్లో ప్రబంధ పఠనాన్ని ఆరంభం చేస్తారు. 
ఈ కాలంలో ఆలయాల్లో నమ్మాళ్వార్ తిరునక్షత్రం ( వైకుంఠ ఏకాదశి రోజు) న దివ్య దేశములలో ఆచారములను బట్టి ప్రబంధాన్ని ఒక్కసారే చదవడం జరుగుతుంది. ఇది ఇళ్లల్లో చెయ్యడం ఉండదు. 

ఈ సమయంలో

పాటించే నియమాలు : 

*1. తిరుక్కర్తే కాలంలో దేవాలయములలో తిరుప్పావై బదులు ఉపదేశరత్తినమాలై చదువుతారు.* 

*2 . కోఇల్ తిరువాఇమొళి లేదా రామానుజ నూఱనాది బదులు తిరువాయ్మొళి నూఱ్ఱన్తాది అనుసంధానమ్ జరుగుతుంది.*

*3. మార్గశిరమాసములో తిరుప్పళ్ళియెళ్ళుచ్చి/తిరుప్పావై అనుసంధానము తిరిగి మొదలు

అవుతుంది.*

కోవెలలో అధ్యయనోత్సవములో 4000 పాశురములను ఒకసారి అనుసంధిస్తారు.

*4. అనధ్యయనకాలములో స్వగృహములందు తిరువారాధనములో 4000 దివ్యప్రబన్ధమ్ అనుసంధింపబడదు (కానీ మార్గశిరమాసములో మాత్రం తిరుప్పావై మరియు తిరుప్పళ్ళియెళ్ళుచ్చి అనుసంధింపబడతాయి).*

*5. స్వగృహములలో పూజామందిర ద్వారములు తెరిచే

సమయములో జితనే స్తోత్రము మొదటి  2 శ్లోకములను, కౌసల్యా సుప్రజా రామ శ్లోకమును,*
 
*6. కూర్మాదీన్ శ్లోకమును అనుసంధిస్తాము, కానీ ఆళ్వార్ల పాశురములను ధ్యానించుట/మననము చేయవచ్చు.* 

*7. తిరుమంజన సమయములో నిత్యము పంచసూక్తములను మాత్రమే అనుసంధించాలి.*

*8. మంత్రపుష్పము తో చెన్జాయ్ కుడైయమ్ పాశురమ్ కు

బదులుగా ఎమ్పెరుమానార్ దరిశనమ్ ఎన్డే పాశురమును అనుసంధిస్తాము.*

*9. శాఱుములై సమయములో శిఱ్ఱమ్ శిరుకాలే, వంగక్కడల్, పల్లాండు పాశురములు చదవరాదు. వాటి కి బదులుగా ఉపదేశరత్తినమాలై మరియు తిరువాయ్మొళి నూఱ్ఱంతాది పాశురములను అనుసంధించాలి.*  

*10. సర్వ దేశ దశాకాలేషు... వాళి తిరునామములతో

కొనసాగిస్తాము.*

*11. మన పూర్వాచార్య విరచితములయిన సంస్కృత స్తోత్రగ్రంధములను, మరియు జానసారము, ప్రమేయసారము, సప్తకాదె, ఉపదేశరత్తిన మాలై, తిరువాయ్ మొళి నూఱ్ఱన్తాది మొదలైన తమిళ ప్రబద్ధములను అభ్యసించుటకు ఇది మంచి సమయము.*
 
*అలాగే పూర్వాచార్యుల తనియన్లను వాళి తిరునామములను . అభ్యసించి

అనుసంధించుకొనవచ్చును.*

*సంప్రదాయ రహస్యగ్రంథములను సేవించి మననము చేసికొనవచ్చును.*

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam