DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ పాస్ లేనిదే అరుణ గిరివలం కు అనుమతి లేదు

 *(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 18,  2021 (డిఎన్ఎస్):* అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి ని పురస్కరించుకుని తమిళ నాడు లోని అరుణాచలంలో శుక్రవారం గిరివలం చెయ్యడానికి ఈ పాస్ ఉంటేనే అనుమతిస్తారు అని స్థానికంగా నివాసం ఉన్న తెలుగు పురోహితులు తెలియచేస్తున్నారు. స్థానికులను కూడా ఈపాస్ లేనిదే గిరివలం కు

అణిమతించడం లేదని, ప్రతి ఆలయం వద్ద సుమారు 8 మంది పోలీసులు బందోబస్తు ఉన్నారని, అనుమతి లేని వారిని అడుగుకూడా నడవనివ్వడం లేదని తెలియచేస్తున్నారు. 

ఈ అరుణ గిరి ప్రదక్షణం 14 కి.మి దూరం ఉంటుంది. గిరిప్రదక్షణం చెప్పులు లేకుండా చేయాలి. ఈ విషయం తెలియక తెలుగువారు చాలా మంది ఇప్పటికే అరుణాచలం కు బయలు దేరినట్టు

తెలుస్తోంది. అయితే ఈ పాస్ లేకపోతే పోలీసులు అస్సలు అడుగు పెట్టనివ్వడం లేదుట. ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మాత్రమే ఈ పాస్ ను విడుదల చేస్తున్నారని తెలిపారు. 
పైగా ప్రస్తుతం అరుణాచలంలో భారీ వర్షాలు పడుతున్నాయి.  బయలు దేరి ఇబ్బంది పడవద్దు అని స్థానికులు భక్తులకు సూచిస్తున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam