DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్యసాయి జన్మదిన వేడుకల్లో సంజన డెంటల్స్ వైద్య శిబిరం 

*(DNS Report : Acharyulu SV, Bureau Chief, Srikakulam)*

*శ్రీకాకుళం, నవంబర్ 22, 2021 (డిఎన్ఎస్):* ప్రపంచ దేశాలను ఆధ్యాత్మిక రంగం ద్వారా ఓలలాడించిన శ్రీ సత్యసాయి బాబా జన్మదిన వేడుకల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా సేవా సంస్థలు సేవా కార్యక్రమాలతో పాటు ఉచిత వైద్య శిబిరాలను సైతం నిర్వహించాయి. ఈ నెల 23 న ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 21 నుంచి

సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సమితి, శ్రీకాకుళం ఎ.పి.హెచ్.బి. కాలనీ, సత్యం శివం సుందరం, సత్యసాయి యువజన విభాగం సహకారాలతో ఎచ్చెర్ల మండలం, జరాజాం పంచాయతీ, తంగివానిపేటలో గ్రామ సేవ చేపట్టారు.  

దీనిలో భాగంగా డా. సంజన డెంటల్ హాస్పిటల్ బృందం, శ్రీకాకుళం సహకారంతో దంత వైద్య

శిబిరం నిర్వహించారు. గ్రామంలోని వారికి దంత పరీక్షలు నిర్వహించి, అవగాహనా తో పాటు, చికిత్సలు అవసరమైన వారికి తగిన సూచనలు అందించారు. ఈ వైద్య శిబిరంలో ఆర్దో నిపుణులు  డా. సంతోష్ ఊది, దంత వైద్యులు డా. సుప్రియ, మేనేజర్ ఎస్. వంశీధర్, పూతిక బాలరాజు, ఆర్. డి. సత్యన్నారాయణ, వంశి కిషోర్ లు పాల్గొన్నారు.  

అనంతరం స్వామి

పల్లకీ ఉత్సవం, అర్హులైన వారికి అమృత కలశములు, దుప్పట్లు పంపినే చేపట్టారు.  మహిళా విభాగం బృందం సభ్యులు చిన్నారులకు బాలవికాస్ శిక్షణా తరగతులు  నిర్వహించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam