DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అయ్యన్న బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే: పోలీస్ సంఘం 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, నవంబర్ 25, 2021 (డిఎన్ఎస్):* జీవితాలను సైతం పణంగా పెట్టి విధి నిర్వహణ చేస్తున్న పోలీస్ శాఖా పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తక్షణం బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణలత డిమాండ్

చేసారు. గురువారం విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశం తీవ్ర ఆవేదన చెందారు. విధి నిర్వహణలో ఎందరో పొలిసు సిబ్బంది, అధికారులు ప్రాణాలు కోల్పోతున్నా. . .ప్రజలకు సేవ చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. బుధవారం విశాఖ జిల్లా నర్సీపట్నం లో జరిగిన నిరసనలను అదుపు చేసేందుకు వెళ్లిన పొలిసు సిబ్బంది నుంచి రాష్ట్ర డిజిపి,

హోమ్ శాఖా మంత్రి వరకూ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. గతంలో ఈయనకు మంచి పేరు ఉందని, అయితే ఇటీవల కాలంలో ఈయన తరుచుగా ఈవిధమైన వ్యాఖ్యలు చెయ్యడం బాధాకరంగా ఉందన్నారు. ఈ ఘటనపై తమ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, తక్షణం ఆయన్ను అరెస్ట్ చేయవలసిందిగా కోరడం జరిగిందన్నారు. సంయమనం పాటించాల్సిందిగా ఉన్నతాధికారుల సూచన మేరకు

తక్షణం బేషరతు క్షణాన డిమాండ్ చేస్తున్నామన్నారు. 

తాము ప్రజలకే సేవకులం తప్ప, రాజకీయ పార్టీలకు కాదన్నారు. గత కొరోనా కట్టడి సమయంలో 24 గంటలూ నిద్రాహారాలు మని మరీ విధులు నిర్వహించామని, ఎందరో పోలీస్ ఉద్యోగులు కొరోనా కు బలయ్యారన్నారు. ఇటీవల నెల్లూరులో వచ్చిన వరదల్లో నీటిలో మునిగి పోతున్న ఒక వ్యక్తిని

రక్షించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన వ్యక్తి పోలీస్ ఉద్యోగేనన్నారు. బుధవారం అర్ధరాత్రి విధి నిర్వహణ పూర్తి చేసుకుని, ఇంటికి వెళ్తున్న విశాఖ 3 టౌన్ సిఐ రోడ్డు ప్రమాదానికి గురై అకాలమరణం చెందారన్నారు. ఉన్నత విలువలు కల్గిన అధికారిగా వీరికి ప్రజల్లో మంచి పేరుందన్నారు. ఇలాంటి దుర్ఘటనలు ఎదురవుతున్న మొక్క ఓని

ధైర్యంతో విధులు చేస్తున్న తమపై బాధ్యత కల్గిన మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం బాధాకరం అన్నారు.  
ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డీ.లలిత, ఎస్.శేషగిరిరావు, టి.అనిల్, .కోటేశ్వరరావు,  ఏం.శేషాద్రి, జిల్లా పోలీస్ అధికారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam