DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖపట్నం పోర్టుట్రస్టు తో వాణిజ్యానికి అమెరికా యత్నం

విశాఖపట్నం, ఆగస్టు 7 2018( DNS Online ): అమెరికా ప్రతినిధుల బృందం విశాఖ పోర్టును మంగళవారం సందర్శించింది. పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు అమెరికా బృందానికి సాదర స్వాగతం

పలికారు. విశాఖపట్నం పోర్టు ట్రస్టులో జరుగుతున్న కార్యకలాపాల వివరాలను చైర్మన్ గారు అమెరికా బృందానికి వివరించారు. ఇక్కడి నుంచి జరుగుతున్న వివిధ రకాల సరుకుల

ఎగుమతులు దిగుమతుల పరిస్ధితిని వివరించారు. పోర్టులో ఉన్న వసతులను అంతర్గత , బాహ్య హార్బర్ లలో నౌకల నిలుపుదల కు ఉన్న అవకాశాలను హార్బర్ సామర్ధ్యం వంటి అంశాలను

చైర్మన్ గారు అమెరికా ప్రతినిధులకు తెలియజేశారు. అమెరికా ప్రభుత్వం స్నేహపూర్వక నౌకా యానానికి ప్రాధాన్యతనిస్తున్న క్రమంలో తాము విశాఖపట్నం పోర్టు ట్రస్టులో

ఉన్న అవకాశాల గురించి తెలుసుకునేందుకు ఇక్కడకు వచ్చినట్లు అమెరికా ప్రతినిధి బృందం వెల్లడించింది. అమెరికాకు చెందిన నౌకలు విశాఖపట్నం పోర్టుకు వస్తే ఇక్కడ

ఉన్న రక్షణ వ్యవస్ధ, వసతులు, నౌక సిబ్బంది భద్రత వంటి అంశాలను ప్రధమికంగా అంచనా వేసేందుకు బృందం పర్యటన ముఖ్య ఉద్ద్యేశ్యంగా వెల్లడించారు. నౌకలు హార్బర్ లోకి

వచ్చేందుకు తీసుకోవలసిన అనుమతులు ఇమ్మిగ్రేషన్ సమాచారం తెలుసుకోవడం కోసం పోర్టు కు వచ్చినట్లు వారు వెల్లడించారు.
 à°µà°¿à°¶à°¾à°–పట్నం పోర్టు ట్రస్టు రక్షణ బాధ్యత

మొత్తం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పరిధిలో ఉంటుందని పోర్టు చైర్మన్ కృష్ణబాబు అమెరికా బృందానికి తెలిపారు. విశాఖపట్నం పోర్టు రక్షణ పరంగా

అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కలిగి ఉంటుందని, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ , భారత నావికాదళం పరిధిలో భద్రతా వ్యవహారాల పర్యవేక్షణ ఉంటుందని చైర్మన్

తెలిపారు.
 à°…మెరికా నుంచి వచ్చి పోర్టును సందర్శించిన బృందంలో అసిస్టెంట్ నావెల్ ఆటాచె ఎస్ సి డిఆర్ జోసెఫ్ జన్ కోలా, డిఫెన్స్ ఆటాచె ఆపరేషన్స్ మల్టా శాంఛెజ్,

ఎన్ సి ఐఎస్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్ రోలిన్స్ డోనాల్డ్, ఎన్ సి ఐఎస్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్ డేవిడ్ ధామస్ కెఫిన్, లైజన్ టు ది డిఫెన్స్ అటాచె దాస్ లారెన్స్ లు

ఉన్నారు. పోర్టు అధికారులు డిప్యూటీ కన్జర్ వేటర్ సీఐఎస్ ఎఫ్ డిప్యూటీ చీఫ్ కమాండెంట్ లు సమావేశంలో పాల్గొన్నారు.

 

#dns #dnslive #dns live #dnsmedia #dns media #dnsnews #dns news #visakhapatnam Port Trust #VPT  #vizag Port #USA #US ship #trading #MT Krishna Babu 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam