DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సముద్రునికి కోటి వత్తులతో  అఖండహారతి

*(DNS Report : P Raja, Bureau Chief, Amaravati)*

*అమరావతి, డిసెంబర్ 22, 2021 (డిఎన్ఎస్):*  కాకినాడ భోగి గణపతిపీఠం ఆధ్వర్యాన ధనుర్మాససంకష్ట హర చతుర్ధి సందర్భంగా సముద్రునికి కోటివత్తుల తో శ్రీవిష్ణుఅఖండ హారతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. సుప్రభాతవేళ పసుపు గణపతితో సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ నగర సంకీర్తన చేపట్టి చతుర్ధి

పారాయ ణ  ముత్తయిదువలకు దంపతుల తాంబూలాలు ప్రదానం చేశారు. అనంతరం సముద్ర తీరం లో సముద్రునికి పూజాధికాలు పూర్తి చేసి కోటివత్తుల అఖండ హారతితో సమారాధననిర్వహిం చారు. సామూహికవిష్ణుసహస్ర నామపారాయణతోఅఖండ జ్యోతి ప్రజ్వలన జరిగింది. గణేశ ఆరాధకులు ఓంజెండాలు చేపట్టి జయజయ భక్తినినాదాలతో సంకీర్తన కొనసాగించారు.ఈ సందర్భంగా

పీఠంవ్యవస్థాపక  ఉపాసకులు దూసర్ల పూడిరమణరాజు వరలక్ష్మీదంపతులు మాట్లా డుతూ ఆధ్యాత్మిక ఆరాధనలో ప్రకృతిని పరిరక్షించుకునే ధర్మాన్ని పాటించడం వలన లోక కళ్యాణం సిద్దిస్తుందన్నా రు.  ప్రకృతి విపత్తుల నివారణకు సముద్రునికి ధనుర్మాసంలో విష్ణు హారతి అందించడం హైందవ సంస్కృతిలో భాగమన్నారు.
పీఠంలో చతుర్ధి

చంద్రోదయవేళకు గోవింద నామాలతో దీపాలంకరణ ఏర్పాట్లు కొనసాగించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam