DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిరుద్యోగ వంచన పై బాబు ని  చొక్కా పట్టి నిలదీయండి :  మళ్ల 

విశాఖపట్నం, ఆగస్టు 7 2018 (DNS Online ): జాబు రావాలి అంటే బాబు పదవిలోకి రావాలి అని ఎన్నికల్లో ఓట్లు దండుకున్న చంద్రబాబు, ఆ హామీని మరిచినందుకు నిరుద్యోగులంతా అతన్ని

చొక్కాపట్టి నిలదీయాలని వైఎస్సార్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు మళ్ల విజయ ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం వైఎస్సార్  à°•à°¾à°‚గ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం

ఆధ్వర్యవం లో చేపట్టిన నిరుద్యోగ వంచన ర్యాలీ కార్యక్రమాన్ని అయన ప్రారంభించారు. నగరం లోని డాబాగార్డెన్స్ వద్ద à°—à°² ఎల్ఐసి  à°•à±‚డలి నుంచి బయలు దేరిన à°ˆ ర్యాలీ

డాబాగార్డెన్స్, జగదాంబ కూడలి మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. అనంతరం వారంతా ఒక వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు సమర్పించారు. ఈ సందర్బంగా

మళ్ల విజయ్ ప్రసాద్ మాట్లాడుతూ 
2014 ఎన్నికకు ముందు ప్రతి ఇంటికో ఉద్యోగం లేదా రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని యువతను నమ్మించి అధికారంలోకి వచ్చిన

చంద్రబాబునాయుడు యువతను మోసం చేశారని అన్నారు.  2 . 12  à°²à°•à±à°·à°²à°•à±  à°ªà±ˆà°—à°¾ ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా కేవలం తన కొడుకు లోకేష్ కు మాత్రమే ఉద్యోగం

ఇచ్చుకున్న ప్రజా నమ్మక ద్రోహి చంద్రబాబేనన్నారు. ఉద్యోగం ఇవ్వని పక్షంలో నెలకు రెండు వేల రూపాయల చొప్పున ప్రతి నిరుద్యోగికి ఇస్తామని హామీలు పుంఖాను

పుంఖాలుగా గుప్పించాడన్నారు. తీరా ఎన్నికల్లో గెలిచాక అవనీ తూచ్ అన్నాడని మండిపడ్డారు. 


నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు వైఖరికి నిరసనగా

రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టాలి అని  à°µà±ˆ.యస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు  à°µà±ˆ.యస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపు మేరకు  à°ˆ నిరుద్యోగ వంచన

ర్యాలీ నిర్వహించామని తెలిపారు. హామీ లు ఇచ్చి, గెలిచినా తర్వాత నాలుగేళ్లు కాలం కళ్ళు మూసుకున్న తెలుగుదేశం పార్టీ, మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయి అన్న సూచనల

మేరకు ఇప్పుడు తూతూ మంత్రంగా కేవలం వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చేసిన ప్రకటనను ప్రజలు నమ్మడం లేదన్నారు. పైగా 33 ఏళ్ల వయసు లోగా ఉండాలి ట, తెల్ల రేషన్

కార్డు ఉండాలిట అప్పుడే ఈ భృతి వెయ్యి రూపాయలు ఇస్తారట. అంటే ఓట్లు అడుక్కోడానికి ఈ నిబంధనలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అప్పుడు అందరి ఓట్లు కావాలి,

ఇప్పుడు హామీ నిలబెట్టుకునే సమయానికి వాళ్ళకి అనుకూలంగా ఉన్నవాళ్ళకి ఇస్తారు అని ఎద్దేవా చేశారు. 

à°ˆ కార్యక్రమంలో వై.యస్‌.ఆర్‌. విశాఖ పార్లమెంటు

అధ్యక్షులు బి.కాంతారావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాలుగేళ్ళు తరువాత మళ్ళీ ఎన్నికలు వస్తున్న తరుణంలో రూ॥1000/` నిరుద్యోగ భృతి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 2.12

 à°²à°•à±à°·à°²  à°‰à°¦à±à°¯à±‹à°—ాలు ఖాళీగా ఉంటే కేవం 20వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్‌ ప్రకటించడం దారుణమన్నారు. 
తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చాక కాంట్రాక్ట్‌

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను దాదాపు 80  à°µà±‡à°² మందిని తొలగించారన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్‌లో నిరుద్యోగులను మోసం చేసి ద్రోహం తల పెట్టిన ప్రభుత్వం, ఉన్న

ఉద్యోగులను తొగించి ఆయా కుటుంబాlను సైతం వీధుపాలు చేసినారన్నారు.  à°šà°‚ద్రబాబునాయుడు 50 నెలలకి రూ॥1 లక్ష బాకీ ఉన్నారని, అది తీర్చకుండా ఎన్నిలకు దగ్గర

పడుతున్నప్పుడు ఎన్నిక భృతిగా à°’à°• పది వేలు వేసి మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. నిరుద్యోగ భృతి కేవలం 12  à°²à°•à±à°· మందికి కాకుండా కోటిమందికి భృతి ఇవ్వాలని,

రూ॥2000   భృతి ఇస్తామని కేవం ప్రస్తుతం రూ॥1000/ ఇవ్వడం దారుణమన్నారు. 
చంద్రబాబు మోసాలను నిరుద్యోగులు  à°—్రహించారని ఎన్నికలు వస్తే ఓటు అనే ఆయుధంతో ఓడిస్తామని

హెచ్చరించారు. 

ఈ కార్యక్రమం లో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ ఇంచార్జి కేకే రాజు, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గుడివాడ అమర్ నాధ్, నగర

మహిళా అధ్యక్షురాలు గారికిన గౌరీ, పెందుర్తి నియోజకవర్గ ఇంచార్జి అదీప్ రాజ్,  à°†à°‚ధ్రాయూనివర్శిటీ తో పాటు నగరంలోని విద్యార్ధులు, యువత భారీఎత్తున హాజరయ్యారు.

 

 

#dns #dns live #dnslive #dnsmedia #dns media #dnsnews #dns news #ysr congress #ysr cp #youth protest #unemployed #andhra pradesh #ap #telugudesam #tdp #chandrababu naidu #cbn 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam