DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సేవా కెనడా ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డా. చారి సేవా శిబిరాలు 

*బస్సునే కంప్యూటర్ ల్యాబ్ గా మార్చి తెలంగాణ, ఆంధ్రాల్లో శిక్షణ* 

*ఏకల్ కంప్యూటర్స్ ల్యాబ్స్ ద్వారా చక్రాలపై కంప్యూటర్ తరగతులు*

*సేవా కెనడా ఇంచార్జి డా. టికెఎన్ చారి పై DNS ప్రత్యేక కథనం* 

*(DNS నివేదిక : సాయిరామ్ CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*హైదరాబాద్ / విశాఖపట్నం, జనవరి 27, 2022 (DNS

ఆన్‌లైన్):* కెనడాకు చెందిన ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ డాక్టర్ TKN చారి నేతృత్వంలోని సేవా కెనడా సంస్థను ప్రారంభించి తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో యువతకు కంప్యూటర్ అవగాహనా తరగతులను నిర్వహిస్తున్నారు. 
విశ్వ హిందూ పరిషత్ కు అనుబంధంగా కెనడా దేశంలో సేవలు అందిస్తున్న సేవా కెనడా సంస్థ తరపున ఫిబ్రవరి 2

నుంచి భాగ్యనగరం (హైదరాబాద్ )లోని దివ్య సాకేతం లోగల ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి నిర్వహిస్తున్న 216 అడుగుల భారీ రామానుజాచార్యులు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం లో జరుగుతున్నా సాధు సంత్ సమ్మేళనంలో నిర్వహణలో కీలక పాత్ర వహించేందుకు హైదరాబాద్ వచ్చిన డా. చారి DNS తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తమ సంస్థ చేస్తున్న

కార్యాచరణను వివరించారు. కెనడా దేశంలో జరుగుతున్నా ప్రకృతి వైపరీత్యాలలో బాధితులను ఆదుకునేందుకు తమ సంస్థ గత కొన్నేళ్లుగా పలు కార్యక్రమాలను చేపట్టిందన్నారు. తమ కుటుంబ సభ్యులు ఇద్దరి తో మొదలైన సేవా కెనడా లో నేడు ఎందరో ధార్మిక సోదరులు భాగస్వాములయ్యారన్నారు. తమకు అండగా వైద్యులు, విద్యా వేత్తలు, ప్రభుత్వ పాలకులు అందరూ

సంఘీభావం పలుకుతున్నారన్నారు. 

స్వదేశం, హిందుత్వ అంటే మక్కువ. .. 

స్వతహాగా మానసిక వైద్య నిపుణులైన డాక్టర్ టికెఎన్ చారి, మనుషుల మనోభావాలను క్షణంలో పసిగట్టి వారిలోని నిరాశావాదానికి తగిన పరిష్కారాలు చూపిస్తుండడం తో మంచి ఫలితాలు లభిస్తున్నాయి. భారత్ తో సహా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, కెనడా వంటి

విదేశాల్లో సైతం ఎన్నో విభాగాల్లో సేవలు అందించి, ప్రస్తుతం కెనడాలో స్థిరపడ్డారు. అయితే తరుచుగా స్వరాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లోని పలు ప్రాంతాలను సందర్శిస్తూ . . .సమయానుకూలంగా ఇక్కడ కూడా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తరుచుగా హిందూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ. . .ప్రముఖులకు సైతం ఎన్నో

సూచనలు చేస్తుండడం గమనార్హం. వీరి విద్యాభ్యాసం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో సాగింది. వీరి తండ్రి టి కె చారి మహారాష్ట్రలోని ఓ ప్రముఖ విశ్వ విద్యాలయానికి ఉపకులపతిగా సేవలు అందించారు. 

తెలుగు రాష్ట్రాల్లో. . .సేవా కెనడా సేవలు. . .

అత్యాధునిక బస్సుల్లో కంప్యూటర్ శిక్షణకు అనువుగా తరగతి గదులుగా

మార్చి, గ్రామాలకు వెళ్లి, వాళ్ళ గ్రామాల్లోనే శిక్షణ చేపడుతున్నారు. రోజుకు రెండు గంటల చొప్పున, ఒక మండలం పరిధిలోని పలు గ్రామాల్లో శిబిరాలను నిర్వహిస్తున్నారు. అత్యాధునిక శిక్షణ సంస్థ ఎకాల్ సంస్థ తో అనుబంధంగా ఈ శిబిరాలను చేపడుతున్నట్టు తెలిపారు.   

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వారు బుధవారం అంటే

జనవరి 26, 2022 న హైదరాబాద్‌కు 190 కిలోమీటర్ల దూరంలోని మహబూబ్ నగర్‌ సమీపంలో  కొందుర్గ్ మండలం నవాపేట్‌లో సర్టిఫికేట్ సెషన్‌ను పంపిణీ చేశారు. 45 రోజుల కంప్యూటర్ కోర్సు పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు పొందిన 180 మంది మధ్య పాఠశాల వయస్సు గల గ్రామ పిల్లల సమావేశానికి హాజరయ్యారు. 
ఒక మధ్య వయస్కుడైన మహిళ, ఆమె కూడా అర్హత

సాధించి ఇప్పుడు స్థానిక బ్యాంకులో ఉద్యోగం సంపాదించింది!!!

గత కొన్ని సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాలకు సేవలు అందిస్తోంది. సేవా కెనడా తరపున, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని మారుమూల గ్రామాల ప్రజలకు డిజిటల్ అవగాహన కల్పించడానికి అతని బృందం ఏకల్ కంప్యూటర్ ల్యాబ్‌లో

చేరింది.

పూర్తి కంప్యూటర్ ల్యాబ్ పరికరాలతో ముందుగా రూపొందించిన బస్సుల ద్వారా వారు ఈ అవగాహన శిబిరాన్ని చేపట్టారు. మొత్తం 45 రోజుల కోర్సు అన్ని వయసుల విద్యార్థుల కోసం రూపొందించబడింది. ప్రతిరోజు ఒక్కో గ్రామానికి వెళ్లి విద్యార్థులకు 2 గంటల పాటు శిక్షణ ఇచ్చి పక్క గ్రామానికి తరలిస్తున్నారు. నిర్ణీత కోర్సు

పూర్తయిన తర్వాత, వారు పరీక్షను నిర్వహించి, అర్హత కలిగిన వారికి అధీకృత సర్టిఫికేట్‌లను అందజేస్తారని డాక్టర్ టికెఎన్ చారి తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam