DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అందరికి మోక్షం అర్హత ఇచ్చిన సమతామూర్తి కి వెయ్యేళ్ళ వేడుకలు

*చిన్న జీయర్ స్వామి సంకల్పించిన సహస్రాబ్ది వేడుకల ప్రణాళిక ఇదే*

*ప్రధాని మోడీ చే  5 న బద్రవేది వద్ద రామానుజ విగ్రహావిష్కరణ* 

*13 న రాష్ట్రపతి కోవింద్ చే రామానుజ సువర్ణ మూర్తి ఆవిష్కరణ*

*11 న సామూహిక ఉపనయనములు.. ప్రతి రోజూ ఇష్టి నిర్వహణ*

*యావత్ సమాజానికి స్వాగతం పలుకుతున్న

సమతామూర్తి వేదిక*  

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnami )*

*విశాఖపట్నం, జనవరి 28, 2022 (డిఎన్ఎస్):* మానవ సమాజంలో అందరికి మోక్ష ప్రాప్తి అర్హత ఉంది అనే కృత నిశ్చయంతో యావత్ సమాజాన్ని మేలుకొలిపిన సమతామూర్తి భగవద్రామానుజాచార్యులు. ఆ సందేశాన్ని అందరికి అందించేందుకు అపర రామానుజులు, పరమహంస పరివ్రాజకాచార్యులు త్రిదండి

చిన్న శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారు సంకల్పించిన రామానుజ సహస్రాబ్ది వేడుకలకు అందరికి స్వాగతం పలుకుతోంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకూ జరుగుతున్నా వేడుకలు వైకుంఠాన్ని తలపించేలా ఉన్నాయి అని ఆ ప్రాంగణాన్ని దర్శించిన ప్రతి ఒక్కరూ తెలియచేస్తున్నారు. దేశంలోని నలు మూలల నుంచే కాకుండా. . .విదేశాల నుంచి సైతం వేదపండితులు,

ఋత్విక్ లు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. విశ్వ శాంతి కోసం జరుగుతున్నా ఈ వేడుకల్లో సుమారు 5000 కు మందిపైగా ఋత్విక్ లు 1035 హోమకుండాలలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం అష్టాక్షరీ, మూలమంత్ర హవానాలు, వేదపారాయణలు, దివ్య ప్రబంధ పారాయణాలు, చేయనున్నారు.        

ప్రధానంగా బద్రవేది ప్రాంగణంలో 216 అడుగుల భగవద్రామానుజుల

విగ్రహాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 5 వ తేదీన ఆవిష్కరించి ఈ ఆధ్యాత్మిక భూలోక వైకుంఠాన్ని ప్రారంభించనున్నారు. అయన సుమారు 4 గంటల పాటు ఆ ప్రాంగణాన్ని సందర్శించి వైభవాన్ని అనుభవించనున్నారు. ఫిబ్రవరి 13 న భారత రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ రామానుజాచార్యుల సువర్ణ మూర్తిని

ప్రారంభించనున్నారు. 

ఈ 12 రోజుల మహోత్సవంలో జరుగనున్న వేడుకలు ఇవే. ..  ( స్వామి వారి అధికారిక website  లో పొందుపరచిన షెడ్యూల్ ప్రకారం ఈ క్రిందనే  కార్యక్రమ వివరాలను అందిస్తున్నాం.)

ఫిబ్రవరి 2, 2022 బుధవారం :

యాగశాల లో : శోభాయాత్ర, వాస్తుశాంతి, ఋత్విక్ వరణ
సాయంకాలము  

 అంకురార్పణ

ఫిబ్రవరి 3, 2022 గురువారం :

యాగశాల లో :  అరణిమథనం, అగ్నిప్రతిష్ఠా, హోమాలు    
సాయంకాలము: హోమాలు 
    
ఇష్టిశాల లో :     దుష్టనివారణకై - శ్రీసుదర్శనేష్టి,
                        సర్వాభీష్టసిద్ధికై - శ్రీవాసుదేవేష్టి    

ప్రవచనమండపము లో :   

 శ్రీశ్రీశ్రీ పెద్దస్వామివారి అష్టోత్తరశతనామపూజ,
                                                ముఖ్యఅతిథుల సందేశములు, ప్రవచనములు

ఫిబ్రవరి 4, 2022 శుక్రవారం: 

యాగశాల లో :  హోమాలు    
సాయంకాలము: హోమాలు 

ఇష్టిశాల లో :     ఐశ్వర్యప్రాప్తికై -

శ్రీలక్ష్మీనారాయణేష్టి,
                       సత్‌ సంతానమునకై - వైనతేయేష్టి    

ప్రవచనమండపము లో :  శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తరశతనామపూజ,
సాయంకాలము:                ప్రవచనములు

ఫిబ్రవరి 5, 2022 శనివారం : వసంతపంచమి

బద్రవేది :   భారతదేశ ప్రధాన మంత్రి "శ్రీ నరేంద్ర

మోడి" గారిచే శ్రీ రామానుజ 216 అడుగుల విగ్రహ ఆవిష్కరణ

యాగశాల లో : ఉదయము, సాయంత్రం  హోమాలు    

ఇష్టిశాల లో :     విజయప్రాప్తికై - విష్వక్సేనేష్టి,
                        విద్యాప్రాప్తికై - శ్రీహయగ్రీవేష్టి    

ప్రవచనమండపము లో : శ్రీవేంకటేశ అష్టోత్తరశతనామపూజ,
/> సాయంకాలము:   ప్రవచనములు

ఫిబ్రవరి 6, 2022 ఆదివారం:     

యాగశాల లో : ఉదయము, సాయంత్రం  హోమాలు    

ఇష్టిశాల లో :     తీవ్ర వ్యాధులనివారణకై – పరమేష్టి
                        పితృదేవతాతృప్తి ద్వారా, విఘ్న నివారణకై - వైభవేష్టి    

ప్రవచనమండపము లో : శ్రీరామ

అష్టోత్తరశతనామపూజ,
సాయంకాలము: ప్రవచనములు

ఫిబ్రవరి 7, 2022 సోమవారం:    

యాగశాల లో : ఉదయము, సాయంత్రం  హోమాలు    

ఇష్టిశాల లో : అకాలవృష్టినివారణకై, సస్యవృద్ధికై – వైయ్యూహికేష్టి.
                     వ్యక్తిత్వ వికాసానికై, ఆత్మోజ్జీవనకై    

ప్రవచనమండపము లో :

శ్రీకృష్ణ అష్టోత్తరశతనామపూజ,
సాయంకాలము: ప్రవచనములు

ఫిబ్రవరి 8, 2022 మంగళవారం:  రథసప్తమి 

యాగశాల లో : ఉదయము, సాయంత్రం  హోమాలు    

ఇష్టిశాల లో :  దుష్టగ్రహబాధానివారణకై - శ్రీనారసింహేష్టి.
                     జ్ఞానా జ్ఞానకృత సర్వవిధపాప నివారణకై - శ్రీమన్నారాయణేష్టి.  

 

ప్రవచనమండపము లో : శ్రీ నారసింహ అష్టోత్తరశతనామపూజ
                                        సామూహిక ఆదిత్యహృదయ పారాయణ
                                        ధర్మాచార్య సదస్సు

సాయంకాలము:  ప్రవచనములు

ఫిబ్రవరి 9, 2022 బుధవారం:     

యాగశాల లో : ఉదయము,

సాయంత్రం  హోమాలు

ఇష్టిశాల లో :   ఐశ్వర్యప్రాప్తికై - శ్రీలక్ష్మీనారాయణేష్టి
                       సత్‌ సంతానమునకై - వైనతేయేష్టి    

ప్రవచనమండపము లో : శ్రీహయగ్రీవ అష్టోత్తరశతనామపూజ,
సాయంకాలము:  ధర్మాచార్య సదస్సు

ఫిబ్రవరి 10, 2022 గురువారం:     

యాగశాల లో :

ఉదయము, సాయంత్రం  హోమాలు

ఇష్టిశాల లో : అకాలవృష్టినివారణకై, సస్యవృద్ధికై – వైయ్యూహికేష్టి.
                     దుష్టగ్రహబాధానివారణకై-శ్రీనారసింహేష్టి    

ప్రవచనమండపము లో : శ్రీరామానుజ అష్టోత్తరశతనామపూజ,
సాయంకాలము:  ప్రవచనములు

ఫిబ్రవరి 11, 2022 శుక్రవారం :    
 

                   సామూహిక ఉపనయనములు    

యాగశాల లో : ఉదయము, సాయంత్రం  హోమాలు

ఇష్టిశాల లో : విద్యాప్రాప్తికై – శ్రీహయగ్రీవేష్టి. 
                     వ్యక్తిత్వవికాసానికై, ఆత్మోజ్జీవనకై    

ప్రవచనమండపము లో : ప్రవచనములు


ఫిబ్రవరి 12, 2022 శనివారం :

భీష్మైకాదశీ        

బద్రవేది : భారతదేశ రాష్త్రపతి "శ్రీ రాం నాథ్ కోవింద్" గారిచే బంగారపు రామనుజ విగ్రహ ఆవిష్కరణ

యాగశాల లో : ఉదయము, సాయంత్రం  హోమాలు

ఇష్టిశాల లో :  తీవ్ర వ్యాధులనివారణకై – పరమేష్టి.
                     పితృదేవతా తృప్తి ద్వారా
               

     విఘ్ననివారణకై – వైభవేష్టి    

ప్రవచనమండపము లో : పరవాసుదేవ అష్టోత్తరశతనామపూజ, 
                                       అష్టోత్తర శత దివ్యదేశ నామార్చన,
                                       ప్రవచనములు    

ఫిబ్రవరి 13, 2022 ఆదివారం: 

యాగశాల లో :

ఉదయము, సాయంత్రం  హోమాలు

ఇష్టిశాల లో :     సువర్ణ పుష్పార్చన    విజయప్రాప్తికై – విష్వక్సేనేష్టి.
                        జ్ఞానాజ్ఞాన కృత సర్వ విధ పాప నివారణకై - శ్రీమన్నారాయణేష్టి    

ప్రవచనమండపము లో : సాయంత్రం ప్రవచనములు

ఫిబ్రవరి 14, 2022 సోమవారం:

  

యాగశాల లో : మహాపూర్ణాహుతి, కుంభప్రోక్షణ, ప్రథమారాధన, ప్రథమ దర్శనము

ఇష్టిశాల లో :     మహాపూర్ణాహుతి

ప్రవచనమండపము లో :  అష్టోత్తరశతదివ్యదేశ శ్రీమూర్తుల
సాయంకాలము                 ప్రథమ కళ్యాణమహోత్సవము    

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam