DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో ప్రతి రోజూ జరిగే  వైదిక వేడుకలు ఇవే

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnami )*

*విశాఖపట్నం, జనవరి 28, 2022 (డిఎన్ఎస్):* మానవ సమాజంలో అందరికి మోక్ష ప్రాప్తి అర్హత ఉంది అనే కృత నిశ్చయంతో యావత్ సమాజాన్ని మేలుకొలిపిన సమతామూర్తి భగవద్రామానుజాచార్యులు. ఆ సందేశాన్ని అందరికి అందించేందుకు అపర రామానుజులు, పరమహంస పరివ్రాజకాచార్యులు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జీయర్

స్వామి వారు సంకల్పించిన రామానుజ సహస్రాబ్ది వేడుకలకు అందరికి స్వాగతం పలుకుతోంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకూ జరుగుతున్న వేడుకలు వైకుంఠాన్ని తలపించేలా ఉన్నాయి అని ఆ ప్రాంగణాన్ని దర్శించిన ప్రతి ఒక్కరూ తెలియచేస్తున్నారు. 
ఈ వేడుకల్లో భాగంగా 5000 కు మందిపైగా ఋత్విక్ లు 1035 హోమకుండలతో శ్రీ లక్ష్మి నారాయణ యాగం లో ప్రధాన

యాగశాలలోను, ఉపయాగశాలల్లోను, ఇష్టి యాగశాలల్లోను, ప్రధాన మండపంలోను నిర్వహించే ప్రతిరోజూ వేదిక కార్యాచరణ ఇది.

విశ్వ శాంతి కోసం జరుగుతున్నా ఈ వేడుకల్లో సుమారు 5000 కు మందిపైగా ఋత్విక్ లు 1035 హోమకుండాలలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం అష్టాక్షరీ, మూలమంత్ర హవానాలు, వేదపారాయణలు, దివ్య ప్రబంధ పారాయణాలు, చేయనున్నారు.    

   

ప్రధానయాగశాల లో 
ప్రతి రోజు ఉదయం గంటలకు     
ఉదయం 5.30 గం – 6.00       ప్రాతస్సంధ్యా    -    -
ఉదయం 6.00 గం – 6.30       జపానుష్ఠాన పూర్వాంగం    -    -
ఉదయం 6.30 గం – 7.30       సామూహిక జపం
                                           (ఋత్విక్కులు,

పంచసంస్కారసంపన్నులు)    -    -
ఉదయం 7.30 గం – 8.00       ఆరాధన, సేవాకాలం
                                           ఉపయాగశాలలో ద్వార తోరణ ధ్వజ కుంభారాధన    
                                           ఇష్టిశాల లో  ద్వార తోరణ ధ్వజ కుంభారాధన    -

ఉదయం 8.00 గం - 8.15  

 ప్రధానయాగశాల లో నివేదన, శాత్తుముఱై, తీర్థగోష్ఠి

ఉదయం 8.15 గం – 9.00    వేదవిన్నపములు

ఉదయం 9.00 గం – 9.30     అన్ని యాగశాలల్లో సంకల్పము, అగ్నిముఖము    
                                         ఇష్టిశాల లో సంకల్పము, ఇష్టి ఆరంభం    

ఉదయం 9.30 గం – 10.30  అన్ని యాగశాలల్లో

మూలమంత్ర హవనములు    
                                            ఇష్టిశాల లో  హోమము, 
                                             విశేష అష్టోత్తరశతనామపూజ

ఉదయం 10.30 గం – 11.45    వేదహవనములు    
                                               

ఇష్టిశాల లో విశేష మంత్ర హోమములు    
                                                ప్రవచన మండపంలో ప్రవచనములు

ఉదయం 11.45 గం – 12.15    అన్ని యాగశాలల్లో పంచసూక్త, పరివార హోమములు     
                                                పంచసూక్త, పరివార హోమములు    
 

                                              ప్రవచనములు

మధ్యాహ్నం 12.15 గం – 1.00  అన్ని యాగశాలల్లో నిత్యపూర్ణాహుతి, శాత్తుముఱై    
                                                
మధ్యాహ్నం 1.00 గం – 4.45    తదీయారాధన    -    సాంస్కృతిక

కార్యక్రమములు

సాయంత్రం 4.30 గం – 5.00    అన్ని యాగశాలల్లో ద్వార తోరణ ధ్వజ కుంభారాధన

సాయంత్రం 5.00 గం – 5.30    సామూహిక శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ    

సాయంత్రం 5.30 గం – 7.30   అన్ని యాగశాలల్లో అగ్న్యారాధన, 
                                                   

మూల మంత్ర హవనములు    
                                                    ముఖ్యఅతిథుల సందేశములు

రాత్రి  7.30 గం – 8.00   అన్ని యాగశాలల్లో పంచసూక్త, పరివార హోమములు    

రాత్రి 8.00 గం – 9.00    అన్ని యాగశాలల్లో నిత్యపూర్ణాహుతి, శాత్తుముఱై    
                   

                    సాంస్కృతిక కార్యక్రమములు

జరుగనున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 5 న, రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ 13 న హాజరవుతున్న నేపథ్యంలో అన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.

కోవిడ్ నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేస్తూన్నారు.

  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam