DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్పందన ను అభాసుపాల్జేసిన దేవాదాయ శాఖ ఏసీ

ఆ గుళ్ళు ప్రభుత్వ పరిధిలో లేవా? ఏసీ తప్పుడు నివేదిక

*విశాఖపట్నం, ఫిబ్రవరి 19, 2022 (డిఎన్ఎస్):* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్పందన’ను జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ అభాసుపాల్జేసిందని సమాచార హక్కు కార్యకర్త, వినియోగదారుల రక్షణ చట్టాల ఉద్యమకర్త కాండ్రేగుల వెంకట రమణ మండిపడుతున్నారు.

సమస్య పరిష్కారం కాకుండా పరిష్కరించినట్టుగా, ఫిబ్రవరి 4న స్పందన పోర్టల్‌లో నమోదైన పిటీషన్‌లోని అంశాలకు సంబంధం లేని లేఖను దేవాదాయ, ధర్మాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఏసీ) కలింగిరి శాంతి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసారన్నారు. ఇదే విషయాన్ని ఎస్‌ఎంఎస్‌ ద్వారా దరఖాస్తుదారునికి సమాచారం పంపించి వివరాలకు

‘స్పందన’ పోర్టల్‌ను సందర్శించాలన్నారు. 
దశాబ్ధాల కాలంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న దేవాలయాలను ‘ప్రైవేటు దేవాలయాలు’గా ఆమె పోర్టల్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే వివాదస్పద అధికారిగా ముద్రపడిన ఆమె ఈ పిటీషన్‌ విషయంలో ప్రభుత్వాన్ని సైతం తప్పుతోవ పట్టించింది. విధుల పట్ల బాధ్యతారాహిత్యం,

నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏసీ కలింగిరి శాంతి చర్యలుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

వివరాల్లోకి వెళితే ... అనకాపల్లి శానససభ నియోజకవర్గంలోని దేమునిగుమ్మం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్ధానం, సుంకర మెట్ట సత్యనారాయణ స్వామి, శ్రీ సిద్ది లింగేశ్వరస్వామి, గవరపాలెం శ్రీ సంతోషిమాత, శ్రీ

జగన్నాధస్వామి, మల్లిమనుగుల శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, కొత్తూరు శ్రీ సత్యనారాయణస్వామి మొదలగు దేవస్ధానాలకు నోటిఫికేషన్లు విడుదల చేసి ట్రస్టు బోర్డులను నియమించాలని, ఏళ్ల తరబడి నియామకాలు జరగపోవడానికి కారణాలు, తప్పిదాలకు సహేతుకమైన కారణాలు వెల్లడిరచాలని, ఆలయాల్లో ముడుపులు, మొక్కుబడులు, కానుకలు,

దక్షిణాలును పల్లెంలలో, చేతులతో స్వీకరించడాన్ని పూర్తిగా నిషేధించాలని, భక్తుల హక్కులకు రక్షణ కల్పించాలని మొదలగు సమస్యలను సిటిజన్‌ ఛార్టర్‌ ప్రకారం నిర్ధేశిత గడువులోగా పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 4న స్పందన ఆన్‌లైన్‌ పోర్టల్‌లో సమాచార హక్కు (ఆర్టీఐ), వినియోగదారుల రక్షణ చట్టాల ఉద్యమకర్త కాండ్రేగుల

వెంకటరమణ ఫిర్యాదు (విఎస్‌పి 2022020449 తేది : 4-2-2022) రిజిస్టర్‌ చేశారు. 

సమస్య పరిష్కార అధికారి దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఏసీ కలింగిరి శాంతి దరఖాస్తులో పేర్కొన్న దేవాలయాలు ప్రైవేటు దేవాలయాలని కాబట్టి దరఖాస్తును తిరస్కరిస్తున్నామని ఈ నెల 11న పోర్టల్‌లో తెలిపారు. ఇదే విషయమై 15న పిటీషన్‌లోని అంశాలకు సంబంధం లేని

వేరొక లేఖ (ఆర్‌సి.నెం.ఎ2/512/2022 తేది :  -01-2022)ను ఆమె అప్‌లోడ్‌ చేసింది. నిస్సుగ్గుగా ఉన్న ఈ చర్యలు ఇటు ఆర్టీఐ, వినియోగదారుల చట్టాల ఉద్యమకర్త కాండ్రేగుల వెంకటరమణను అటు ప్రభుత్వాన్ని ఆమె తప్పుతోవ పట్టించిందన్నారు. ఈ నేపధ్యంలో మళ్లీ ఈ పిటీషన్‌ను శనివారం ‘స్పందన’ పోర్టల్‌లో మళ్లీ రీ ఓపెన్‌ చేశామని కాండ్రేగుల

వెంకటరమణ తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్టకు, ‘స్పందన’ లక్ష్యాలకు తూట్లు పొడిచిన దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఏసీ శాంతిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి, జిల్లా కలక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam