DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*వారిజ జీయర్ ఆశ్రమంలో విద్యార్థులతోనే హయగ్రీయ పూజలు* 

*27 నుంచి ప్రారంభం, ఉచితంగా ప్రతి ఆదివారం ఉదయం వేళల్లో*

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnami)*

*విశాఖపట్నం, ఫిబ్రవరి 24, 2022 (డిఎన్ఎస్):* ప్రతి ఆదివారం విద్యార్ధులతో ఉచితంగా శ్రీ లక్ష్మి హయగ్రీవ స్వామి పూజలు చేయిస్తున్నట్టు భీమిలి వారిజ చిన్న జీయర్ స్వామి ఆశ్రమం ప్రతినిధి ముడుంబై శ్రీకాంత్ స్వామి తెలియచేసారు. ఈ

కార్యక్రమం ఈ నెల 27 వ తేదీ నుంచి ఆరంభిస్తున్నామని, ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10 :30 గంటల వరకూ జరుగుతుందన్నారు.   

వేద విద్య సహా సామాన్య లౌకిక విద్య చదువుతున్న విద్యార్థులకు అందరికి హయగ్రీవ స్వామి, కటాక్షం లభించాలి అనే సంకల్పంతో జ్ఞాన ప్రదాత హయగ్రీవ స్వామి అనుగ్రహం లభిస్తే విద్యార్థులు తమ విద్యా

సంవత్సరం లో మంచి ఫలితాలు పొందుతారన్నారు. మంచి భవిష్యత్ ప్రతి విద్యార్థికి లభించాలి అని ఉచితంగానే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం నిర్వహించనున్నామన్నారు. 

ఈ కార్యక్రమం లో విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాలల నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒక ఆధ్యాత్మిక వాతావరణం లో జరుగుతున్న ఈ సేవలను

ప్రత్యక్షంగా పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఆదివారం ఈ పూజలు జరుగుతాయన్నారు. 

ఒక ప్రక్క వేద విద్యార్థుల వేదపఠనం,  మరొక ప్రక్క గోశాల లోని గోవుల సందడి, ఆ ప్రక్కనే యాగశాలలో ఇష్టి కార్యక్రమం తో పాటు సమీపంలోనే ఉన్న అందమైన బీచ్ వాతావరణం కూడా విద్యార్థులకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని

అందిస్తుందన్నారు. 

ప్రతి పుష్యమి నక్షత్రం రోజున స్వర్ణ ప్రాశన ఆయుర్వేద ప్రసాదం ఉచితంగానే అందిస్తున్నామన్నారు. ప్రతి పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మి హయగ్రీవ స్వామికి స్వయంగా భక్తులే అభిషేకం చేసుకునే అవకాశం ఉందన్నారు. అదే రోజు హయగ్రీవ ఇష్టి లో కూడా పాల్గొనవచ్చన్నారు. 

ఆశ్రమం

చిరునామా:

అపర రామానుజులు, మమతామూర్తి త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించబడుతున్న వారిజ ఆశ్రమం ( వేద అధ్యయన పరిశోధన కేంద్రం, వేద పాఠశాల) ఆవరణలోని శ్రీ లక్ష్మి హయగ్రీవ మందిరం లో విద్యార్థులచే స్వయంగా హయగ్రీవ పూజలు నిర్వహించబడుతున్నాయన్నారు. ఈ ఆశ్రమం భీమిలి

బీచ్ రోడ్ లోని తొట్లకొండ సమీపంలోని మంగమారి పేట లోనే ఉంది. 

ఈ ఉచిత హయగ్రీవ పూజ తోపాటు ఆశ్రమం లో జరిగే ఇతర వివరాలకు ఆశ్రమ నిర్వాహకులను 92472 17901, 7989762149 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు.  
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam