DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*ప్రచార వైఫల్యమే చిన్నజీయర్ పై విమర్శలకు కారణమా?*

*పెద్దలకే పరిమితమవ్వడమే విమర్శలకు ప్రధాన ఊతం* 

*సామాన్యులకు స్వామిజి దూరమవ్వడానికి కారణం కోటరీయేనా?*

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnami )*

*విశాఖపట్నం, మార్చి 01, 2022 (డిఎన్ఎస్):* అపర రామానుజులు, ప్రపంచ దేశాలకు అత్యున్నతమైన సమతామూర్తి సందేశాన్ని అందించిన ఆధ్యాత్మికవేత్త చిన్న జీయర్ స్వామిజి ఎంతో

ఉన్నతులు. గొప్పవాళ్లే. .ఆ విషయం అందరికి తెలిసిందే. అయినప్పటికీ వారిపై గత కొన్ని నెలలు గా ఇతరులు కూడా వినలేని, కనీసం కలలో కూడా ఊహించలేని విధంగా వెల్లువవుతున్న విమర్శల వెనుక ఎన్నో కారణాలు కనపడుతున్నాయని వారి భక్తులే అభిప్రాయపడుతున్నారు. 

గత నాలుగు దశాబ్దాలుగా సమాజ శ్రేయస్సుకే పాటు పడుతూ ట్రైబల్

స్కూళ్ళు, అంధ పాఠశాలలు, ఆసుపత్రులు, అవయవ దాన అవగాహనా సదస్సు వేలాదిగా నిర్వహించడం తో పాటు, ఆగమ, వైదిక సంప్రదాయాన్ని మరింత వ్యాప్తి చెందించేందుకు వేద పాఠశాలలు, ఆశ్రమాలు నెలకొల్పి వేలాదిమందికి ఉపాధి కల్పించారు. ఇటీవలే 216 అడుగుల సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని, 108 దివ్య దేశాల నమూనా ఆలయాలను ప్రారంభించారు. దీంతో ఆయన

ఖ్యాతి విశ్వ విఖ్యాతం అయ్యింది అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.  
 
*ప్రచారంలో పూర్తి వైఫల్యానికి నిదర్శనమే.* 

ఇంత విశ్వ ఖ్యాతిగాంచిన స్వామిజి గురించి విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం లో సంబంధిత కమిటీలు పూర్తిగా వైఫల్యం చెందడమే ఇతరులు విపరీత స్థాయిలో విమర్శలు చెయ్యడానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇది

ఎవరూ కాదనలేని అంశం. ప్రధానంగా ఈ సంస్థల కార్యకలాపాలను ప్రచారం చెయ్యడంలో సరైన క్రమబద్దీకరణ ఉన్న ప్రచార వ్యవస్థ లేకపోవడం ప్రధాన కారణం కావచ్చు. 
అయితే స్వామిజి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు గ్రామస్థాయిలోని సామాన్య ప్రజలకు తెలియదు అంటే అది పూర్తిగా ప్రచార లోపమేనన్నది వాస్తవం. ప్రతి విషయాన్నీ

స్వామిజి నేరుగా సామాన్యుల దగ్గరకు వెళ్లి చెప్పే అవకాశం లేదు. kevalam వారి శిష్య బృందం పరిధిలోనే ప్రచారం నిలిచిపోవడం కడుశోచనీయం. ఆయన అందించే సందేశాలను గ్రామ స్థాయిలో కి ( క్షేత్ర స్థాయిలో) తీసుకువెళ్లడం లో ఈ బృందాలు  వైఫల్యం చెందాయి. 

*స్వామిజి దూరమవ్వడానికి కారణం కోటరీయేనా?*  

గతంలో చిన్న జీయర్

స్వామి పేరు చెప్పగానే గ్రామ స్థాయిల్లో ప్రజలు సైతం ఎంతో ఆసక్తి కనపరిచేవారు. దానికి కారణం నాడు స్వామిజి వారికి అందుబాటులో దగ్గరగా ఉండేవారు. అయితే నేడు వారి పరిధి పెరుగుతుండడంతో సామాన్యులు స్వామీజీని చేరుకునే అవకాశమే లేకుండా పోయింది. దీంతో ఆయన్ని సాక్షాత్తు దైవంగాను, అపర రామానుజులుగానే కొలిచే ఆయన శిష్యులు,

భక్తులు  కూడా వారికి దూరమవుతున్నారు. దానికి ప్రధాన కారణం వారి వెనుక ఉండే ప్రధాన కోటరీయే అనే ప్రచారం ప్రజల్లో  విస్తృతంగా సాగుతోంది. స్వామిజి ఒక్కసారి తమ వైపు చూస్తే చాలు అనే భావించే భక్తులు కూడా నేడు స్వామీజీకి దూరమవుతున్నారు. 

దీనికి నిదర్శనమే ఇటీవల వారి ఆశ్రమం లో జరిగిన 1035 హోమ కుండాల శ్రీ లక్ష్మి

నారాయణ యాగంలో పాల్గొన్న వైదికులు సైతం స్వామిజి దర్శనం లేకుండానే వెనుదిరిగిన వాళ్ళే వందలాదిగానే ఉన్నారు. దీనికి కారణం వీరంతా స్వామీజీని చేరుకునే అవకాశం లేకపోవడమే. స్వామిజి ఆశ్రమంలోనే ఖాళీగా ఉన్న సమయాల్లో సైతం వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన శిష్యులు సైతం స్వామిజి దర్శనం చేసుకోలేకపోతున్నారు అంటే. . స్వామిజి

పరిధిలో ఉండే కోటరీయే అనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. 

అనుమతి కోసం వచ్చిన. . .ఆబ్బె అవకాశం లేదు:.

స్వామిజి పై వస్తున్నా విశృంఖల విమర్శలను త్రిప్పికొట్టేందుకు స్వామిజి అనుమతి కోరేందుకు వచ్చినా సరే వీరెవ్వరికి స్వామి దర్శనం కాకపోవడం అత్యంత బాధాకరం. ఈ పరిస్థితులు స్వామిజి తెలిసి

సమయానికి సామాన్యులు, భక్తులు కనుచూపు మేరలో సైతం కనపడే అవకాశం ఉండదు అన్నది వాస్తవం.   

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam