DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంతర్వేది గుడి మండపం ప్రక్కనే మాంసాహార దుకాణమా? 

*తూగో జిల్లా నరసింహ క్షేత్రంలో అపచారాలను అడ్డుకోరా?*

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnami )*

*విశాఖపట్నం, మార్చి 07, 2022 (డిఎన్ఎస్):* తూర్పుగోదావరి జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన  అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి పరిసరాల్లో జరుగుతున్నా అపచారాలకు అడ్డులేకుండా పోతోందని, వీటిని తక్షణం అడ్డుకోవాలని

హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. స్వామి వారి వాహన సేవ నిర్వహించే పదహారు కాళ్ళ మండపానికి ఆనుకుని మాంసాహార దుకాణం పెట్టి విక్రయాలు చేస్తున్న ఆలయ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. 

ప్రతి బుధవారం రోజున మార్కెట్ లో పెడుతున్నారని, స్వామి వారి ఊరేగింపులు, భక్తుల సంచారం

ఇబ్బందికరంగా మారిందన్నారు. తక్షణం దీన్ని తరలించాలని హైందవ సైన్యం వ్యవస్థాపక అధ్యక్షులు పెనుగొండ దుర్గా ప్రసాద్, అయినవిల్లి ఇంచార్జ్ ఆర్ జె వై వర్మ తదితరులు ఆలయ ఈవో దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీన్ని తరలించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. 
 
స్వామి ఉత్సవాలు నిర్వహించే

మండపం ప్రక్కనే కార్యక్రమం మాంసాహార విక్రయ దుకాణం ఉండడం ఏంటని ప్రశ్నించారు 

ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మన హిందూ ధర్మాన్ని, సంప్రదాయాన్ని  కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువు పైన ఉందన్నారు. ఆలయాలు భక్తుల కోసమే ఉన్నాయి తప్ప ఉద్యోగులు, ట్రస్ట్ బోర్డుల కోసం కాదన్నారు.  

అయితే

ఈ దుకాణం ఇటీవలే పెట్టినట్టు ఆలయ అధికారులు తెలియచేస్తున్నారు. ఇప్పడికే  ఈ అంశంపై సంబంధిత విభాగం అధికారులకు నోటిస్ ఇచ్చినట్టు తెలియచేస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam