DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వెంకట రమణ శర్మకు సివి రామన్ సేవారత్న పురస్కారం 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 07, 2022 (డిఎన్ఎస్):* విశాఖ నగరం కు చెందిన ఏలూరు వెంకట రమణ శర్మకు భాగ్యనగరం కు చెందిన  సివి రామన్ అకాడెమీ వారిచే సకల కళా వైభవ రత్న పురస్కారం తో పాటు ఇటీవలె ఇండియా ఎక్స్టెన్స్ అవార్డు ( రాష్ట్రీయ సేవారత్న అవార్డు ) లు లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ షిర్డీ సాయి ఆలయంలో ప్రధానార్చకులు గా సేవలందిస్తున్న శర్మకు సముచిత గౌరవం లభించడం అందరికి ఆనందంగా ఉందని  ఆలయ కమిటీ తరఫున ఆలయ కమిటీ ప్రతినిధులు లాలం అప్పలనాయుడు, పాలిమే రశెట్టి జగదీష్, కణితి అర్జున రావు అభినందనలు తెలియచేసారు. ఒకప్రక్క అర్చకునిగా వైదికమైన సేవలు అందిస్తూనే, క్రీడాకారులకు సాయం చేయడం ప్రోత్సాహం

అందించడంతోపాటు, పేదవారికి ఆర్థికంగా చేయూతనిస్తూ ఉదారతను చాటుకుంటూ, పాత్రికీయునిగా సైతం సేవలందిస్తు ఎప్పటికప్పుడూ నిత్య వి ద్యార్థిలా కష్టపడుతూ, ఉంటారన్నారన్నారు.  ఈ సందర్బంగా పెందుర్తి మర్రిచె ట్ల కాలనీ శ్రీ షిరిడి సాయి బాబా ఆలయ కమిటీ తరపున శర్మకు ప్రతినిధులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. శర్మకు రాష్ట్రీయ సేవ

రత్న అవార్డు ఇచ్చిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam