DNS Media | Latest News, Breaking News And Update In Telugu

13 నుంచి భీమిలి సాగర తిరుమల ఆలయ దశమ వార్షికోత్సవం 

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnami )*

*విశాఖపట్నం, మార్చి 08, 2022 (డిఎన్ఎస్):* విశాఖ నగర పరిధిలోని భీమిలి కృష్ణా కోలని లోని సాగర తిరుమల పుణ్యక్షేత్రం లో వెలసిన శ్రీశ్రీశ్రీ పద్మావతి, గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ  వారి దశమ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 13 నుంచి 18 వరకూ

జరుగనున్నాయి. 

ఈ నెల 13 ఆదివారము నాడు సాయంత్రం 6 గంటలకు విష్వక్సేన ఆరాధన తో మొదలై, రక్షా సూత్ర బంధనం, ఋత్విక్ వరుణము, మృత్సంగ్రహణము, యాగశాల ప్రవేశం, అగ్ని మధనం, అగ్ని ప్రతిష్టాపన, అంకురార్పణ తో మొదటి రోజు కార్యక్రమం ముగుస్తుంది.  

14 న వాస్తు, యోగీశ్వర, లక్ష్మీ నారాయణ మండపావాహనం, పతాక ప్రతిష్ఠ, గరుడ

పంచశయ్యాధివాసం, గరుడ ప్రతిష్ట, అష్ట దిక్పాలక ఆవాహన, ధ్వజారోహణం అనంతరం  గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం "శ్రీవారి కళ్యాణ మహోత్సవం" అత్యంత వైభవోపేతముగా జరుపబడుతుంది.

15 న నిత్య హోమములు, శ్రీలక్ష్మీనారాయణ సామూహిక వ్రతములు జరుగుతాయి. సాయంత్రం , అమ్మవార్ల విహార యాత్ర, తెప్పోత్సవం

జరుగుతుంది.

16 న నిత్య హోమములు, ఆయు, ఆరోగ్య ఐశ్వర్య సిద్ధి కొరకు సుదర్శన హోమము జరుపబడును. సాయంత్రం దోపోత్సవం (దొంగల దోపిడి ఉత్సవం) తిరుమంగై ఆళ్వార్ చరిత్ర పఠనం, ఉంటుంది. 

17 న నిత్య హోమములు, సౌభాగ్యం కొరకు అష్టలక్ష్మి సామూహిక కుంకుమార్చన, సాయంత్రం పండిత సదస్యం, తులాభారం 

18 న ఉదయం

కొట్నాలోత్సవం, నవ కలశ స్నపన తిరుమంజనము, సాగర తీరములో చక్ర తీర్ణోత్సవం, అన్న కూటోత్సవం, సాయంత్రం మహా పూర్ణాహుతి, అష్ట దిక్పాలక ఉద్వాసన, 
ధ్వజ అవరోహణము, సప్తావరణలు, జరుగుతాయి. 

వివరాలకు ఆలయ అర్చకులు జి.వి. అప్పలాచార్యులు ( 7981239418 ) లను సంప్రదించవచ్చు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam