DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమహేంద్రి మహిళా కాలేజీ లో లీగల్ వర్క్ షాప్ 

*(DNS Report : P Raja, Bureau Chief, Amaravati)*

*అమరావతి, మార్చి 08, 2022 (డిఎన్ఎస్):* అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో విద్యార్థినులకు ఒక అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా న్యాయ

సేవా సంస్థ నిర్వహించింది. 

జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే. ప్రత్యూష కుమారి  ముఖ్యఅతిథిగా పాల్గొని మహిళా చట్టాల మీద విద్యార్థులకు విపులంగా వివరించి, చట్టాల యొక్క ప్రాముఖ్యతను, వాటిని ఉపయోగించుకునే విధానాన్ని విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

కళాశాల

ప్రిన్సిపాల్ గారు సత్య సౌందర్య  మాట్లాడుతూ మహిళ ప్రతి విషయం మీద పట్టు సాధించి జీవితంలో ముందడుగు వేస్తూ ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ లక్ష్యం సాధించే ధ్యేయంగా విద్యార్థులందరూ కృషి చేయాలని అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని అన్నారు. 

ఐదవ డిస్ట్రిక్ట్ కోర్టు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అడ్వకేట్ వి. కుమార్

స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు చెప్పిన విధంగా, వారికి  అనుగుణంగా నడుచుకుంటూ, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు.

న్యాయవాది బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకుని జీవితంలో స్థిరపడాలని అన్నారు. 

పేరా లీగల్

వాలంటీర్ ఎం. వసంత రాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ వైపు ప్రయాణం చేయాలని, దాన్ని సాధించే వరకూ నిద్రపోకుండా పట్టుదలతో కృషి చేయాలని అన్నారు.

అనంతరం జడ్జి ప్రత్యూష కుమారిని రాజమహేంద్రి మహిళా కళాశాల తరపున ప్రిన్సిపాల్ తేతలి సత్య సౌందర్య, సీనియర్ న్యాయవాదులు ఘనంగా

సన్మానించారు. అందరూ  విద్యార్థులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినారు.

ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లీగల్ అధారిటీ సర్వీసెస్ సభ్యులు మరియు రాజమహేంద్రి మహిళా కళాశాల ఎన్.ఎస్.ఎస్ పి.వో లు లక్ష్మీ ప్రవీణ, ఎం. కె. ఎస్. ప్రసాద్, వెంకట్, వీరస్వామి, లక్ష్మీ, రత్నం, నాగమ్మ, తదితరులు పాల్గొన్నారు.
/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam