DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరి కాటేజీల స్థితి పై ఇఓ సూర్య కళ పరిశీలన

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnami )*

*విశాఖపట్నం, మార్చి 09, 2022 (డిఎన్ఎస్):* సింహాచల క్షేత్రంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం లోని గజపతి ప్రహ్లాద కాటేజీ ల పరిస్థితి ని ఇఓ ఎంవి సూర్య కళ పరిశీలించారు. అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్న సింహాచల దేవస్థానం  ఇఓ సూర్య కళ మరో అడుగు ముందుకు వేసి భక్తుల

వసతి గృహాలు అయినా గజపతి సత్రం లో 1వ నెంబరు రూమ్ నుండి 48 వ రూమ్ ప్రతి రూము ఇంజనీరింగ్ విభాగం మరియు కాటేజీ ల కు సంబంధించిన  అధికారులతో కలసి ప్రతి రూములో ఉన్న లోపాలను కావలసిన సౌకర్యాలను గుర్తించి అధికారులకు అక్కడికక్కడే సూచనలు చేయడం జరిగింది కాటేజెస్ లో బస ఉన్న భక్తులకు త్రాగునీరు సమస్య లేకుండా చూడాలని వాటర్ వర్క్స్

ఏఈ  రామరాజు కి సూచించారు అందుకు కావలసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను పరిశీలించారు కాటేజెస్ లో ఎప్పటినుంచో ఉన్న పరుపులు తలగడలు అలాగే బెడ్ షీట్ లు పాడైపోయిన వాటి స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయుటకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు ను ఆదేశించారు అలాగే గజపతి సత్రం పైన గల

సెల్ఫోన్ టవర్ యొక్క  అద్దె వివరాలకు సంబంధించిన ఫైలు వెంటనే తనకు సమర్పించాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు సత్రం లకు సంబంధించి ప్లంబింగ్ శానిటరీ మరియు  కార్పెంటర్  ఎలక్ట్రికల్ వాటర్ కు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని  ఇఓ తెలియజేశారు. వీరితో డిఇ  రాంబాబు,   ఏఇ  రాజు రామరాజు,

 తాతాజీ,  నాగేశ్వరరావు, బాబ్జి,  ఏఇఓ  వై శ్రీనివాసరావు లు ఉన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam