DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సైన్యంలో ఎంపిక కోసం నోయిడా రోడ్డుపై రోజు రాత్రి 10 కిమీ పరుగు

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 21, 2022 (డిఎన్ఎస్):* భారత సైన్యం లో చేరాలనే లక్ష్యం కోసం ఒక యువకుడు ప్రతి రోజు చేస్తున్న సాధన నోయిడా వాసులను నివ్వెరపరుస్తోంది. ఉత్తరాఖండ్ కు చెందిన 19 ఏళ్ళ వయసు గల యువకుడు ప్రదీప్ మెహ్రా తాత్కాలిక ఉపాధి కోసం మెక్‌డొనాల్డ్‌లో పనిచేస్తున్నాడు. ప్రతి రోజు రాత్రి

డ్యూటీ ముగిసిన తర్వాత 10 కిలో మీటర్ల దూరం లో ఉన్న తన ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఇది గత కొన్ని రోజులుగా జరుగుతున్నప్పడికి ఇటీవలే వినోద్ కాప్రీ అనే ఒక స్థానిక నోయిడా వాసి ఇతని పరుగు చూసి తన కారులో దింపుతాను అని అడిగినప్పుడు ప్రదీప్ తన లక్ష్యం గురించి చెప్పాడు. తానూ భారత సైన్యం లో చేరేందుకు ప్రయత్నాలు

చేస్తున్నానని, దానికి తగిన వ్యాయామం చెయ్యడం ఉదయం పూట కుదరదని, దానికోసం రాత్రిళ్ళు ఉద్యోగం ముగిసి ఇంటికి వెళ్లే తప్పుడు పరుగు సాధన చేస్తున్నట్టు  తెలిపాడు. ఒకరోజు మీరు దింపుతారు, ఒకసారి ఈ సుఖం అలవాటు పడితే తనకు లక్ష్యం దూరమైపోతుందన్నారు. తన గ్రామం లో తల్లి ఒక వైద్య చికిత్స పొందుతోందని, ఇంటికి వెళ్లి, తనకు,

సోదరునికి, వంట చెయ్యాలని, త్వరగా వెళ్లేందుకు మరింత వేగంగా పరుగులు పెడుతున్నట్టు తెలిపారు. 
నోయిడాలోని సెక్టార్ 16 లోని తన ఉద్యోగం నుండి బరోలాలోని తన ఇంటికి ప్రతిరోజూ 10 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు, అక్కడ అతను తన సోదరుడితో కలిసి నివసిస్తున్నాడు.

వినోద్ కాప్రీ ఇదంతా వీడియో రూపంలో చిత్రీకరించి సోషల్

మీడియా లో పోస్ట్ చెయ్యడంతో ఒక్కసారిగా వైరల్ గా మారింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam