DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నియామకాలు చెల్లకేనా స్మార్ట్ సిటీల చైర్మన్ ల రాజీనామాలు? 

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 21, 2022 (డిఎన్ఎస్):* iteevala రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నియమించిన పలు స్మార్ట్ సిటీల చైర్మన్ లు రాజీనామా చేయడం వెనుక ఈ నియామకాల్లో సాంకేతిక పరమైన ఇబ్బంది ఉండడమే కారణంగా కనపడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ jagan మోహన్ రెడ్డి కి అత్యంత సన్నిహితునిగా ఉన్న

ఘట్టమనేని వెంకటేశ్వర రావ్ గ్రేటార్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు  లేఖ వ్రాయడమే తడువుగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తూ ఆదేశాలు జారీచేసింది. వీరితో పాటు తిరుపతి, కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ లు కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. 

అయితే తానూ వ్యక్తిగత

కారణాలతో జీవీఎంసీ స్మార్ట్ సిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జివి వివరణ ఇచ్చారు. అయితే దీనిపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రికి జగన్ కు సన్నిహితుడు గా ఉన్న జివి రాజీనామా చెయ్యడం పట్ల వైసీపీ నేతల మద్య జోరుగా చర్చ జరుగుతోంది. 

సాంకేతికంగా స్మార్ట్ సిటీ కార్పొరేషన్

చైర్మన్లు నియామకాలు చెల్లవని ఆలస్యంగా గుర్తించిన రాష్ట్రప్రభుత్వం,  వీరిని రాజీనామా చేయాలని ఆదేశించినట్లు సమాచారం

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam