DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఆర్టీసీ డిపోలో డ్రైవర్లకు సాంకేతిక శిక్షణ శిబిరం

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 23, 2022 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజా రవాణా సంస్థ ( ఎపియస్ ఆర్టీసీ ) లో డ్రైవర్ ట్రైనింగ్ స్కూల్ లో తొమ్మిదవ బ్యాచ్ ను  ఇంచార్జి రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు బుధవారం ప్రారంభించారు. విశాఖపట్నం డిపో లో (విశాఖ పార్లమెంటు నియోజకవర్గం) జరిగిన ఈ శిబిరం లో 16

సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ లో ఉన్న డ్రైవర్లను ఉద్దేశించి రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజం లో ఉన్న డ్రైవర్ల కొరతను దృష్టిలో ఉంచుకుని సుశిక్షితులైన డ్రైవర్లను తయారుచేసే ఉద్దేశంతో  ఏపియస్ ఆర్టీసీ లో డ్రైవింగ్ శిక్షణ పొందే వారికి 30 సంవత్సరాలకు పైగా డ్రైవింగ్ లో ప్రమాదరహిత అనుభవమున్న

శిక్షకులు, మెకానికల్ సిబ్బంది, కొత్త టెక్నాలజీ తో కూడిన బస్సులు, ప్రతిరోజూ థియరీ తో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  డిప్యూటీ సీఎంఇ రూరల్ సిహెచ్ అప్పలనారాయణ, డిపో మేనేజర్ డి. ఢిల్లేశ్వరరావు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam