DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మీడియా వారూ.. ఇంటర్వ్యూల కై నా జోలికి రాకండి, ప్రదీప్

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 24, 2022 (డిఎన్ఎస్):* ప్రస్తుత సమాజంలో జాతీయ మీడియాల్లో ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టె జనం ఉన్న ప్రస్తుత రోజుల్లో ఒక 19 ఏళ్ళ యువకుడు మీడియా ను ఇంటర్వ్యూ ల కోసం తన వద్దకు రావద్దు అని చెప్పేసాడు. వివరాల్లోకి వెళితే. . భారత సైన్యం లో చేరాలనే లక్ష్యం కోసం ఒక

యువకుడు ప్రతి రోజు రాత్రి వేళల్లో 10 కిమీ ల దూరం పరుగెడుతున్న 19 ఏళ్ళ ప్రదీప్ మెహ్రా గురించి సోషల్ మీడియా లో వినోద్ కాప్రీ అనే సినీ దర్శకుడు ప్రసారం చేసిన వీడియో దేశ, విదేశాల్లో వైరల్ కావడంతో వివిధ మీడియాల ప్రతినిధులు ఇతని కోసం ఇంటర్వ్యూ కై ఒత్తిడి తేవడంతో, అతను ఈ విధంగా స్పందించినట్టు తెలుస్తోంది. తన సాధనకు

దూరమైపోతున్నట్టు తెలిపారు. 
ఇతని లక్ష్య సాధన తెలిసిన వారందరూ అభినందించడమే కాక, ఇతను సైన్యం లో ఎంపికయ్యేందుకు అవసరమైన సూచనలు అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 
ఈ వీడియో తీసిన సమయంలో వినోద్ కాప్రి ఈ వీడియో వైరల్ అయితే ఏమి చేస్తావ్ అని కూడా అడగడం గమనార్హం.  మొత్తానికి అనుకున్న అంతా

అయ్యింది. ఇతని లక్ష్య సాధన ఆటంకం లేకుండా సాగి లక్ష్యాన్ని చేరుకోవాలని మనం కూడా ఆశిద్దాం.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam