DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అష్టలక్ష్మి ఆలయం మరింత వైభవోపేతం కానుంది: విష్ణుభట్టాచార్య 

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 24, 2022 (డిఎన్ఎస్):* విశాఖ నగరంలోని కొమ్మాది లో వేంచేసిన అష్టలక్ష్మి దేవాలయానికి మహోన్నతమైన వైభవం లభిస్తుందని, తిరుమల తిరుపతి దేవస్థాన. వైఖానస ఆగమ శాస్త్ర సలహాదారులు, డా. వేదాన్తం శ్రీవిష్ణు భట్టాచార్య స్వామి తెలియచేసారు. విశాఖ నగరంలో టిటిడి ఆలయ మహా

సంప్రోక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్న అయన అనంతరం గురువారం కొమ్మాది ఆలయాన్ని సందర్శించారు. 
ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధరన్ స్వామి వీరికి పూర్ణ కుంభస్వాగతం పలికి ఆలయ మర్యాదలతో అర్చనలతో అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుని దర్శనం చేయించారు. 
తదుపరి ఆలయ వైభవాన్ని తాము గతంలోనే విన్నామని, ఎంతో వైభవోపేతమైన

కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్న అర్చక బృందానికి ఆయన ఆశీస్సులు అందించారు. 

ఆలయ విశేషాలు, విగ్రహ రూపాలు, ఆలయనిర్మాణ శైలి విధివిధానాలను తెలియచేసారు. ఎంతో సుందరమైన ఈ ఆలయం మంచి ప్రామాణికంగా ఉందని, విగ్రహ రూపాలు చాలా అరుదుగా ఉండేవని తెలిపారు. ఇక్కడ ఆరాధనలు, అలంకరణలు అద్భుతంగా ఉన్నాయని భక్తుల

కోర్కెలు ఖచ్చితంగా ఇక్కడ తీరుతాయన్నారు. ఎందరో పీఠాధిపతులు, భగవతోత్తములు ఈ ఆలయాన్ని సందర్శించారని, ఈ ప్రాంగణంలో మంగళశాసన పూర్వక  ప్రవచనాలను అందించారని తెలిపారు. 

అనంతరం టిటిడి సలహాదారులు ఆలయానికి వచ్చారన్న విషయం తెలిసిన భక్తులు ఆలయానికి చేరుకొని వారి ఆశీస్సులను పొందారు. ఇకపై విశాఖపట్నం వచ్చిన

ప్రతి పర్యాయం, తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శిస్తామన్నారు. 

ఈ ఇక్కడ నూతనంగా నిర్మాణకై ప్రతిష్ట జరిగిన యిషికొండ వేంకటేశ్వర ఆలయం ఆరుకులంగా జరిగిన సేవలు జరుగుతాయని అక్కడ నుంచే అర్చకస్వాములు వస్తారని వెళ్ళి దర్శించి తరించమని ఆయన తెలియ జేసారు .

అర్చకుల సోదరులు బాలభాస్కరన్ స్థపతి, చిట్టే జగదీశన్ లు

రూపొందించిన ఆలయ నమూనా డిజైన్ ను చూసి అద్భుతంగా ఉందని కొనియాడారు. ఎంతో పరిజ్ఞానం, ఆసక్తి, భక్తి ఉంటె తప్ప ఒక ఆలయ నమూనా సిద్ధం చెయ్యడం సాధ్యం కాదన్నారు. అలాంటిది 250 ఆలయాలకు నమూనాలను రూపొందించి, ప్రతిష్ట లు చేయడం పూర్వజన్మ సుకృతమని,  ఈ సోదరులను ఆశీర్వదించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam