DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దర్శన్. . పవర్ ఫుల్ సైన్యంలో పవర్ ఫుల్ సంప్రదాయం పాటిస్తూ

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 24, 2022 (డిఎన్ఎస్):* ప్రపంచంలోనే పవర్ ఫుల్ సైన్యం గా భావించబడే అమెరికా వైమానిక దళంలో అంతకంటే పవర్ ఫుల్ భారతీయ సనాతన హిందూ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు దర్శన్ షా. వివరాల్లోకి వెళితే. . 

దర్శన్ షా గుజరాతీ సంతతి కి చెందిన వారు. దర్శన్ మిన్నెసోటాలోని ఈడెన్

ప్రైరీ లో పెరిగారు.  స్వామి నారాయణ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. స్వామి నారాయణ్ సంప్రదాయం అనుసరించే వారు ఎరుపు చుక్క లేదా "చాండ్లో," నారింజ U- ఆకారపు తిలకం ధరించడం ఆనవాయితీ. 

రెండు సంవత్సరాల క్రితం 2020 లో విధుల్లో చేరినప్పటి నుండి, 90వ ఆపరేషనల్ మెడికల్ రెడినెస్ స్క్వాడ్రన్‌కు కేటాయించబడిన ఏరోస్పేస్

మెడికల్ టెక్నీషియన్ దర్శన్ మినహాయింపును కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి 22, 2022న, మొదటిసారిగా యూనిఫాంలో ఉన్నప్పుడు తిలక్ చండ్లో ధరించడానికి అతనికి అనుమతి ఇవ్వబడింది.

భారతీయ హిందూ సంతతికి చెందిన దర్శన్ షా యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళంలో విధులు నిర్వహిస్తున్నారు. సనాతన సంప్రదాయానికి చెందిన తానూ నుదుటన

సంప్రదాయ  తిలక ధారణ చేస్తూ నేడు విధులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా సైన్యం లో పని చేసేవారికి ఈ విధమైన వెసులుబాటు, అవకాశం ఉండవు. అయితే ఈ అనుమతి పొందేందుకు దర్శన్ తీవ్రమైన పోరాటమే చేశారు. తానూ చిన్నతనం నుంచి సంప్రదాయాన్ని పూర్తిగా పాటిస్తున్నామని, ఉద్యోగంలో కూడా అనుమతించాలంటూ ఉన్నతాధికారులకు ఎన్నో సార్లు

దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వ్యోమింగ్‌లోని FE వారెన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ఉన్న US వైమానిక దళం లో సభ్యులు.  భారత్ సహా,  అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ మరియు న్యూయార్క్‌ కు చెందిన స్నేహితులు చాలా సంతోషం వ్యక్తం చేశారన్నారు. 

ఈయన తమ గురువు హరి మహంత్ స్వామి మహారాజ్ కు ఫోన్ ద్వారా

ఈ సమాచారాన్ని తెలియచేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam