DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉద్యోగి మతం మారితే వేటే, లవ్ జిహాద్ కి రిప్లై గట్టిగానే ఇస్తాం

*విహెచ్ పి ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే హెచ్చరిక* 

*విశాఖ పర్యటనలో డిఎన్ఎస్ కు పరాండే ప్రత్యేక ఇంటర్వ్యూ*  

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 25, 2022 (డిఎన్ఎస్):* హిందూ ధర్మం నుంచి ఇతర మతాల్లోకి మారిన తక్షణం తమ ఉద్యోగం వదులుకోవాల్సిందేనని, లవ్ జిహాద్ లకు గట్టి రిప్లై

ఇస్తామని  విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే హెచ్చరించారు. శుక్రవారం విశాఖ నగర పర్యటనకు వచ్చిన ఆయన డిఎన్ఎస్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ క్యాడర్ ను మరింత బలోపేతం చేస్తున్నామని, తాము ఇతర మతాలకు వ్యతిరేకం కాదని, అలా అని మా జోలికి

వచ్చి కార్యకర్తల పై భౌతిక దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ప్రధానంగా లవ్ జీహాద్ పేరుతొ హిందూ సంప్రదాయ కుటుంబాలలోని బాలికలను మోసగించి, జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారని ఆవేదన చెందారు. ప్రతి రోజూ డజన్ల కొద్దీ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని, వీటన్నింటికి త్వరలోనే బ్రేక్ వేస్తామన్నారు. ప్రతి హిందూ

కుటుంబం తోనూ ప్రత్యక్షంగా కలిసి తమ విహెచ్పి కార్యకర్తలు, నాయకులూ కలిసి, అందరిలోనూ ఆత్మస్థైర్యం నింపుతామన్నారు. ప్రతి కుటుంబం లోనూ యువతి యువకులకు హిందూ సంప్రదాయం పట్ల సంపూర్ణం విశ్వాసం కల్పించేలా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. 

భారత దేశాన్ని ముస్లిం లు, క్రైస్తవులు దోచుకుని, ఏళ్ళ తరబడి పరిపాలన

చేసి, బలవంతపు మతమార్పిళ్లు చేశారన్నారు. దానికి నిదర్శనమే రాజస్థాన్ లాంటి హిందూ తత్వ ప్రాంతాల్లో సైతం మతమార్పిళ్లు జరుగుతున్నాయన్నారు. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో సెక్యులర్ పేరుతొ క్రైస్తవ, ముస్లిం లకు ఇబ్బడి ముబ్బడిగా ఆర్ధిక, సామాజిక ప్రోత్సాహాలు అందిస్తున్నారన్నారు. అదే హిందూ కుటుంబాలకు

మాత్రం టాక్స్ ల మోత మోగిస్తున్నారన్నారు. 

అయోధ్య లో రామ మందిరం సాధించుకున్నామంటే దేశ వ్యాప్తంగా హిందూ సమాజం అండ పూర్తిగా ఉందన్నారు. మందిర నిర్మాణానికి అత్యంత సామాన్యుల నుంచి ధనికుల వరకూ అందరూ తమవంతు సహకారం అందించారన్నారు. త్వరలోనే అయోధ్య రామ మందిరం లో భవ్య రాముణ్ణి ప్రజలందరూ దర్శనం

చేసుకోవచ్చన్నారు. 

కాశ్మీర్ లో 30 ఏళ్ళ క్రితం జరిగిన నరమేధం లో కాశ్మీరీ హిందువులు ప్రధానంగా కాశ్మీరీ పండిట్ లు, సిక్ లు, ఇతర మైనారిటీలు అత్యంత దారుణాలకు బలైపోరన్నారు. దానికి ప్రధాన కారణం నాటి కాంగ్రెస్ పాలకులు 1990 జనవరి 18 వరకూ చేసిన అరాచక పాలనే నిదర్శనమన్నారు. తదుపరి 1990 జనవరి 19 న అధికారం లోకి వచ్చిన ప్రభుత్వం

కాశ్మీర్ లో జరిగిన మరణ కాండను అడ్డుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇదంతా హిందూ సమాజం పై అన్యమతాలు చేసిన ఆధునిక దాడిగా అభివర్ణించారు. 

ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో జరుగుతున్నా దోపిడీ చాలా ఎక్కువగా ఉందన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం హిందూవులుగా ఉన్నవారికే ప్రభుత్వ ఉదోగాలు

ఇవ్వాలన్నారు. అయితే మతం మారిని వాళ్ళు రిజిస్టర్ లో తమ కులం హిందువుగానే నమోదు చేసుకుంటున్నారని, అయితే ఉద్యోగాలు మాత్రం చేస్తూ, అన్యమతాల్లో కొనసాగుతున్నారన్నారు. 
ఈ విధమైన దోపిడీ కారణంగా హిందువుల్లో ఉన్న రిజర్వేషన్ సదుపాయాన్ని నిజమైన  హిందువులు కోల్పోయి ఉద్యోగాలకు దూరమవుతున్నారన్నారు. దీనికై క్షేత్ర

స్థాయిలో విహెచ్పి కార్యకర్తలు పర్యటిస్తారన్నారు. రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందిన ఏ ఉద్యోగి అయినా మతం మారారు అని అనుమాన వాళ్ళ ఇంటిని పరిశీలించి, ఇళ్లల్లో అన్యమత ఫోటోలు ఉండడం, చర్చ్ లాంటి ప్రార్ధన స్థలాలకు వెళ్లడం గమనిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఇప్పడికే తమ కార్యకర్తలపై అక్రమంగా అట్రాసిటీ కేసులు

పెట్టారని, దానికి భయపడేది లేదన్నారు. 

దీనికై అత్యంత పటిష్టంగా పని చేసి, హిందూ ధార్మిక వ్యవస్థను రక్షించాలన్నాడు. 

కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో హిందూ సమాజంపై ప్రత్యక్ష దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వాలు కళ్ళుమూసుకుని ఈ దాడులను బాహ్య సమాజానికి తెలియకుండా విశ్వ ప్రయత్నాలు

 చేస్తున్నాయన్నారు. దీనికి నిదర్శనమే కాశ్మీర్ లో 30 ఏళ్ళ క్రితం జరిగిన కాశ్మీరీ పండిట్ ల ఊచకోత అన్నారు. ఇకపై ఇలాంటి దుర్భాగ్య స్థితి హిందూ సమాజానికి రాకుండా సమాజాన్ని మేలుకొలుపుతామన్నారు. 
ఒక కాశ్మీరీ ఫైల్స్ చిత్రంతో హిందూ సమాజం పై జరిగిన ఊచకోత బాహ్య ప్రపంచానికి తెలిసిందని, నాటి పాలకులు చేసిన హిందూ

ద్రోహానికి నిదర్శనంగా నేడు కాశ్మీరీ పండిట్ లు సొంత దేశంలోనే పరాయివారుగా జీవిస్తున్నారన్నారు.

దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో వేలాది మంది ప్రజలు హిందూ సంప్రదాయాన్ని పట్టిస్తున్నారన్నారు. దానికి భిన్నంగా భారత్ లో అత్యంత దారుణం గా హిందువులపై ఊచకోతలు, బలవంతపు మతమార్పిళ్లు

జరుగుతున్నాయన్నారు. 

వేలాది ఏళ్ళ చరిత్ర ఉన్న హిందూ సనాతన ధర్మం పై దాడులు చేస్తున్న వారికి తగిన బుడ్డి చెప్పాలని దేశవ్యాప్తంగా కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam