DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జులై లో ఆంధ్ర మహాభారత అవతరణ సహస్రాబ్ది వేడుకలు 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 26, 2022 (డిఎన్ఎస్):* రాసి సంస్థ నిర్వహిస్తున్న నన్నయ్య ఆంధ్ర మహాభారత అవతరణ సహస్రాబ్ది మహోత్సవాలు, రాజరాజనరేంద్ర సహస్రాబ్ది ఉత్సవాలు ఆహ్వాన కరపత్రాన్ని  కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి జి కిషన్ రెడ్డి విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో

జరుగుతున్న రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 
2022 వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ కారపాత్ర ఆవిష్యకార చేసారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి, బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధికార ప్రతినిధి  డా. సుహాసిని ఆనంద్ ఉత్సవాల నిర్వహణను కేంద్రమంత్రి కి వివరించారు. ఈ వేడుకలను మన రెండు తెలుగు రాష్ట్రాలలోను 2022 జూలై, ఆగస్టు నెలల్లో నిర్వహిస్తున్న

సందర్భంగా ఆంధ్ర మహాభారతం అవతరణ సహస్రాబ్ది మహోత్సవాలు నన్నయ్య, రాజరాజనరేంద్ర సహస్రాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నారు. 

జూలై 22, 23, 24, 2022 మూడు రోజుల పాటు రాజమహేంద్రవరం లో రాసి కేర్స్, నన్నయ వాంగ్మయ వేదిక సంయుక్త ఆధ్వర్యంలోను, జూలై 31 2022 (ఆదివారం) న విశాఖపట్నం లోను, ఆగస్టు 7, 2022 (ఆదివారం) హైదరాబాద్ లలో

జరుగనున్నాయి. 

ఎన్నో సంవత్సరాలుగా, సాంఘిక, సంక్షేమ కార్యక్రమాలను, కళ- సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న రాసి సంస్థ ఈ చారిత్రాత్మక సహస్రాబ్ది ఉత్సవాల్ని కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహిస్తోంది.

ఈ వేడుకలను పురస్కరించుకుని ఒక చిరస్మరణీయమైన సంచిక

కూడా ప్రచురించనున్నారు. ఈ చారిత్రాత్మక మహోత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా నిర్వాహకులు కోరుతున్నారు. 

ఆంధ్ర సాహిత్య భాగ్య విధాత నన్నయభట్టారకుడు. ఆ మహాకవిని ఆదరించి ఆంధ్ర మహాభారత రచనకు ప్రేరేపించిన మహారాజు రాజరాజనరేంద్రుడు.  ఆ రాజు పట్టాభిషేకం సాధారణ శకం 1022, ఆగస్టు 22వ తేదీన జరిగినట్లు

చరిత్రకారుల నిర్ధారణ. రాజరాజ నరేంద్ర పట్టాభిషేకం, నన్నయ ఆంధ్రమహాభారత అవతరణ జరగడం, ఈ రెండూ జరిగి ఈ 2022 సంవత్సరానికి వెయ్యి ఏళ్ళు పూర్తవుతుంది. 

దానిని పురస్కరించుకుని ఈ సహస్రాబ్ది మహోత్సవాలు 2022 లో నిర్వహించడం మన కర్తవ్యం అని రాసి సంస్థ ప్రతినిధులు డా. సుహాసిని ఆనంద్, పాలగుమ్మి రాజగోపాల్  తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam