DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏప్రిల్ 1 న పరీక్షా పే చర్చ ముఖాముఖీలో ప్రధాని మోడీ 

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 29, 2022 (డిఎన్ఎస్):* విద్యార్థులలో పరీక్షలంటే ఉండే భయాన్ని తొలగించడానికి కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యవం లో పరీక్షా పే చర్చ ఐదవ  సంచిక అనే  కార్యక్రమం ఏప్రియల్ 1 న శుక్రవారం విజయనగరం కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ తెలిపారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర

 ప్రధాన్ అధ్యక్షతన జరిగే  ఈ కార్యక్రమం లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖాముఖీ చర్చలో పాల్గొంటారు.  దేశ  విదేశాలలోని కోట్లాది  విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాద్యాయులు  దృశ్య  మాధ్యమం ద్వారా  ఈ చర్చ లో పాల్గొంటారానున్నారు. ఏప్రియల్ 1 న శుక్రవారం ఈ కార్యక్రమం పరీక్షా  పే చర్చ న్యూఢిల్లీ నుంచి

ప్రత్యక్ష  ప్రసారం చేయబడుతుందన్నారు. 

కేంద్ర  విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర  ప్రధాన్ అందించిన సమాచారం మేరకు చాల రోజుల నుండి ఎంతో  ఆత్రుత   తో ఎదురు  చూస్తున్న  ఈ వార్షిక చర్చ లో నరేంద్ర మోడీ,  పరీక్ష  లంటే  విద్యార్థులకు  ఉండే భయం మరియు వత్తిడి, వాటిని ఎలా అధిగమించాలో తెలిపే  అంశాలపై

 ముఖాముఖీ  చర్చిస్తారు.

కోవిద్ -19 పూర్తిగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పరీక్షలు  పాఠశాలలలోనే   ప్రత్యక్షముగా నిర్వహిస్తున్నారు .  ఈ పరీక్షా పే చర్చ ఒక సాంప్రదాయ వ్యవస్థ గా  మారుతుంది .  ఇందు  లో 21 వ శతాబ్ద పు   సవాళ్లు - ఆర్ధిక   వ్యవస్థ  బలోపేతం  ఎలా  చేయాలి  అనేవి  ముఖ్య అంశాలు .   ఈ చర్చ లో

అత్యధికంగా అందరు  పాల్గొనాలని కోరారు.  దీనికి తగ్గ ఏర్పాట్లు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు , ప్రసార  సాధనాలు  చేయాలనీ తెలిపారు.  

01. 04. 2022  ఉదయం 11. 00 గంటలకు  ఈ కార్యక్రమం న్యూఢిల్లీ లోని టాల్కటోరా  స్టేడియం నుండి  యూట్యూబ్, దూరదర్శన్, ఆకాశవాణి, ప్రసారభారతి తదితర అన్ని ప్రసార మధ్యంలోనూ ప్రసారం

చేయబడుతుందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam