DNS Media | Latest News, Breaking News And Update In Telugu

12 నుంచి కళాభారతి లో కౌశిక్ రాష్ట్రస్థాయి నాటికల పోటీలు

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 07 , 2022 (డిఎన్ఎస్):* ఈ నెల 12 నుంచి 16 వరకు పైడా కౌషిక్ నాటకోత్సవములు విశాఖపట్నం లోని కళాభారతి కళా ప్రాంగణం లో జరుగనున్నాయి. ఈ సందర్భంగా 16వ వార్షిక రాష్ట్రస్థాయి ఆహ్వాన సాంఘిక నాటికల పోటీలు జరుగనున్నాయి. గురువారం  వేదిక వద్ద జరిగిన

విలేకరుల సమావేశంలో ఆహ్వాన కమిటీ కార్యదర్శి గుమ్ములూరి రాంబాబు నాటికల ప్రదర్శనల వివరాలను తెలిపారు. 
12 న రాత్రి గం|| 6-45 ని॥లకు అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి "ఐదుపదులు" నాటిక,  మూలకథ: వి. దుర్గా ప్రశాంతి, నాటకీకరణ & దర్శకత్వం: కావూరు సత్యనారాయణ
అదే రోజు రాత్రి గం||8-15 ని॥లకు చైతన్య కళాభారతి "చీకటి పువ్వు"

కరీంనగర్ వారి నాటకీకరణ : పరమాత్ముని శివరాం, మూలకథ: పి.ఎస్. నారాయణ, దర్శకత్వం: మంచాల రమేష్
13 న సా| గం॥ 6.30 ని॥లకు 'గంగోత్రి, పెదకాకాని వారి "ఆస్తికలు" మూలకథ శ్రీరమణ నాటకీకరణ పిన్నమనేని మృత్యుంజయరావు, దర్శకత్వం : నాయుడు గోపి, 
రాత్రి గం॥ 8-15 ని||లకు  అరవింద ఆర్ట్స్, తాడేపల్లి వారి “స్వర్గానికి వంతెన" మూలకథ: డా॥

మధురాంతకం నరేంద్ర నాటకీకరణ వల్లూరు శివప్రసాద్ దర్శకత్వం: గంగోత్రిసాయి.
14 న రాత్రి గం|| 6-45 ని||లకు సద్గురు వారి "కమనీయం" విద్యాధర్ దర్శకత్వం బసవరాజు 
రాత్రి గం 8.15 గంటలకు "లక్ష్మణరేఖ... రచన: గోవిందరావు దర్శకత్వం: ఎస్. 
15 న సా॥ గం॥ 6-45 శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం, బొరివంక వారి "ది డెత్ ఆఫ్ ఎ

మేనేటర్ మూలకథ అల్లం శేషగిరిరావు. నాటకీకరణ & దర్శకత్వం : కె.కె.ఎల్. స్వామి
రాత్రి గం॥ 8-15 ని॥లకు శ్రీ మణికంఠ ఆర్ట్స్ కొండెవరం వారి "కొత్తతరం కొడుకులు" మూలకథ రావు కృష్ణారావు నాటకీకరణ & దర్శకత్వం: చెలికాని వెంకట్రావు
16 న రాత్రి గం|| 6-45 ని॥లకు సిరిమువ్వ కల్చరల్స్, హైదరాబాద్ వారి "థింక్” రచన & దర్శకత్వం : బి.

మంజునాథ. 
రాత్రి గం॥ 7-45ని॥లకు బహుమతి ప్రదానోత్సవ సభ జరుగుతుంది.
ఈ విలేకరుల సమావేశంలో సంస్థ డీక్షులు ఎంఎస్ఎన్ రాజు, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam