DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భూకబ్జా కేసులో శివునికే కోర్టు నోటీసు, కోర్టులో శివుడు హాజరు 

*ఛత్తీస్ ఘర్ తహసీల్దార్ సిబ్బంది ఘనతకు విస్తుపోయిన జనం*

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 08 , 2022 (డిఎన్ఎస్):* ఆలయంలో ఆరాధనలు andukovalsina మహాదేవుణ్ణే కోర్టు లో ప్రవేశ పెట్టిన ఘనత కేవలం భారత్ ప్రభుత్వ అధికారుల కే  దక్కుతుంది.  ఇలాంటి అత్యంత ఆసక్తికరమైన ఘటనలకు  ఆలవాలంగా  ప్రస్తుత ప్రభుత్వ

అధికారుల పనితీరు అడ్డం పడుతోంది. 

ఇటీవల ఛత్తీస్ ఘర్ లోని ఒక తహసీల్దార్ కార్యాలయం నేరుగా మహా శివునికి కోర్టు నోటీసులు పంపింది. ఒక భూ కబ్జా కేసులో కోర్టు విచారణకు హాజరుకాకపోతే.. చట్టప్రకారం చర్యలు (భూమిని ఖాళీ చేయించి, రూ.10 వేలు జరిమానా) తప్పవని హెచ్చరించారు. దీంతో శివలింగంతో సహా నోటీసులు అందుకున్నవారంతా

విచారణకు హాజరయ్యారు. వివరాల్లోకి వెళితే. .

రాయ్‌గఢ్‌ 25వ వార్డుకు చెందిన సుధా రజ్వాడే ఇటీవల బిలాస్‌పుర్‌ హైకోర్టులో కొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఓ పిటిషన్‌ వేశారు. ఆ భూమిలో ఉన్న శివాలయం సహా మొత్తం 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 

విచారణ చేపట్టిన హైకోర్టు.. దర్యాప్తు

చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటనే స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం రంగంలోకి దిగింది. ప్రాథమిక విచారణ అనంతరం 10 మందికి నోటీసులిచ్చారు. గత  2022 మార్చి నెల 25న జరిగే విచారణకు వచ్చి.. భూకబ్జా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. 

ఈ సంఘటనలో శివుడితో పాటు నోటీసులు అందుకున్న మరో 9 మంది విచారణకు

హాజరయ్యారు. తమతో పాటు గుడిలోని శివలింగాన్ని రిక్షాలో కోర్టుకు తీసుకొచ్చారు. 

ఏకంగా శివుణ్ణి కోర్టు కు తీసుకు రావడంతో భక్తులు, ప్రభుత్వ అధికారులు సైతం విస్తుపోయారు.

ఆలయ కమిటీ కి ఇవ్వ వలసిన నోటీసులు నేరుగా శివునికి ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మూల విరాట్ నే కోర్టుకు తీసుకు వచ్చినట్టు

తెలుస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam