DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*పెద కాకాని గుడి క్యాంటిన్ లో వన్ నాన్ వెజ్ వంటకాల తయారీ*   

*అన్యమతస్తుడికి కాంట్రాక్టు ఇవ్వడంపై విహెచ్పి మండిపాటు* 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 08 , 2022 (డిఎన్ఎస్):* గుంటూరు జిల్లాలోని పెదకాకాని  భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలోని క్యాంటిన్ లో అన్యమత కాంట్రాక్టర్ మాంసాహార వంటలు తయారు చెయ్యడం పై విశ్వ హిందూ పరిషత్ నేతలు, భక్తులు

మండిపడుతున్నారు. 

హిందూ దేవాలయాల్లోను, అనుబంధ సంస్థల్లోనూ అన్యమతస్తులకు ఉద్యోగాలు, కాంట్రాక్టు ఇవ్వడం పై విహెచ్పి నేతలు మండిపడుతున్నారు. భక్తులు తీసిన ఫోటోల కారణంగా గురువారం వెలుగు లోకి వచ్చిన ఈ ఘటనపై దేవాదాయ శాఖా మీనమేషాలు లెక్కపెడుతోంది. గతంలోనూ ఇదే ఘటనలు ఇక్కడే జరిగిన దాఖలాలు ఉన్నాయి. అయితే

అప్పుడూ, ఇప్పుడూ కూడా దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని భక్తులు ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు. 

భక్తులకు కాఫీ, టీ, శాకాహార టిఫిన్లు, అన్నదానం మాత్రమే తయారు చేసేందుకు వేలంపాట ద్వారా కాంట్రాక్ట్ ఇచ్చిన ఈ ఆలయ క్యాంటిన్ లో అన్యమత నిర్వాహకులు మాంసాహార వంటలను వండారు. అధికార పార్టీ నేత ఈ క్యాంటిన్ ను ఇతరుల

పేరుతో వేలంలో నిర్వహణ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తనకు వచ్చిన ఓ ఆర్డర్ లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని క్యాంటిన్ లో మాంసాహారం వండి బయటకు పంపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్నీ గమనించిన భక్తులు ఫోటోలు తీయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై భక్తులు, ఆల అధికారులు స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై దేవాదాయ

శాఖా ఉన్నతాధికారులు సైతం కాంట్రాక్టు రద్దు చేసి తూతూమంత్రంగా చేతులు దులుపు కోవడం పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

సాక్షాత్తు టిటిడి లోనే  క్రైస్తవ, ముస్లిం ఉద్యోగులు భారీ సంఖ్యలోనే ఉన్నారని, ఇక అదే స్థాయిలో చిన్న దేవస్థానాల్లోనూ అన్యమతస్తులు విచ్చలవిడిగా ఉద్యోగాలు, కాంట్రాక్టులు చేస్తూనే

ఉన్నారని విహెచ్పి మండిపడుతున్నారు. హిందూ ధర్మం పై నమ్మకం లేని వాళ్ళకి ఉద్యోగాలు, కాంట్రాక్టు లు ఇస్తే. .హిందూ ధర్మాన్ని చేజేతులా ఇలాగె బ్రష్టు పట్టించడం అని విహెచ్పి తెలిపింది.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam