DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ హెచ్చరికలు అస్మదీయులకా? లేక తస్మదీయులకా?

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 12 , 2022 (డిఎన్ఎస్):* వెంట్రుక ఎవ్వరూ పీకలేరు అంటూ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం చేసిన హెచ్చరికలు అస్మదీయులకా లేక తస్మదీయులకా అనేది అసంబద్దంగానే ఉంది. రాష్ట్ర మంత్రి వర్గం మార్పు

నేపథ్యంలో పాత క్యాబినెట్ మంత్రుల రాజీనామా సమయంలో ప్రతిపక్షాలు, మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను ఉద్దేశించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక బహిరంగ సభలో పై విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే కొత్త మంత్రివర్గ కూర్పు తదుపరి సొంత పార్టీ లోని మాజీ మంత్రులు, అనుచరులు, చేసిన రాద్ధాంతం నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలు వీళ్ళకి కూడా

వర్తిస్తాయంటూ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. దానికి అనుగుణంగానే మంత్రి పదవి పోయిన వారు, ఆశించి రాని వారు కూడా ఒక్క రోజు చేసిన హంగామా తర్వాత సైలంట్ అవ్వడమే నిదర్శనం.
ఒక్క హెచ్చరిక ఇటు సొంతపార్టీ లోని అసమ్మతి వారినీ, అటు ప్రతిపక్షాల వారినీ కూడా అదుపు చేసే విధంగా ఉంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam