DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచల చందన యాత్ర పటిష్ట ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 20 , 2022 (డిఎన్ఎస్):* భక్తులకు అసౌకర్యం కలుగకుండా దర్శనం కోసం చందనోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున సింహాచలం ఇఓను ఆదేశించారు. వచ్చే నెల 3 వ తేదీన సింహాచలం దేవస్థానంలో జరుగబోయే చందనోత్సవాల పై జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ

మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ శాఖల కో ఆర్డినేషన్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల క్యూల దగ్గర టెంట్లు వేసి వారికి నీడగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎండకు కాళ్ళు కాలకుండా కార్పెట్ వేయాలన్నారు. విఐపిల స్లాట్స్ పెంచాలని ఆదేశించారు. టికెట్లు నకిలీ వి తయారు

కాకుండా బార్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  దర్శనానికి వచ్చే భక్తులకు తాగునీరు ఏర్పాటు చేయాలని, వృద్ధులకు, వికలాంగులకు వీల్ ఛైర్స్ ఏర్పాటు చేయాలన్నారు. దర్శనాలకు వచ్చే ఏ ఒక్క భక్తుడు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు.  భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం చక్కగా జరిగేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం

చేశారు. 4, 5 కిలో మీటర్లు నడక మార్గం ఉంటుందన్నారు. ఈ మార్గంలో భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలుగకుండా చూడాలని ఆదేశించారు.   ఈ మార్గంలో అందుబాటులో టాయిలెట్లు  ఉండాలని, వాటిని శుభ్రం చేసే సిబ్బందిని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.  సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. స్వచ్ఛంద సంస్థలు, ఎన్ సిసి, ఎన్

ఎస్ ఎస్ వంటి వారు వాలంటీర్లకు ఐడి కార్డులు జారీ చేయాలని, ఎవరిని ఎక్కడ పెడతారో ముందు గానే నిర్ణయించాలన్నారు. చందనోత్సవాల దర్శనాలకు సంబంధించిన రూ.300/-, రూ.500/-,రూ.1000/-, రూ.1200/-ల టికెట్లు ఉంటాయన్నారు.   
ప్రముఖుల సంఖ్య పెరిగిందని, కావున  స్లాటింగ్ టైం పెంచడమైనదన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా, వారిని బస్సులు పై

తరలించడం జరుగుతుందన్నారు. ఉదయం 3 గంటలకు దర్శనాలు ప్రారంభమై రాత్రి 12 గంటల వరకు స్వామి వారి దర్శనం ఉంటుందని వివరించారు. సాధారణ భక్తులకు దర్శనం నిరంతరం జరుగుతుందని పేర్కొన్నారు.  కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, సర్జికల్ మాస్క్ లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఎన్ని వాహనాలు వస్తాయో అంచనా వేసి పాస్ లు జారీకి

తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్ పై పోలీసులు, దేవాదాయ శాఖ సిబ్బంది సంయుక్తంగా పరిశీలించి అంచనా వేయాలని ఎసిపిని ఆదేశించారు.  చందనోత్సవాలకు సరిపడ బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఆర్ ఎం ను ఆదేశించారు. షిఫ్టులు వారీగా డ్యూటీలు వేయాలన్నారు. పోలీసు, దేవస్థానం, ఆర్టీసీ కో ఆర్డినేషన్ చేసుకోవాలని

సూచించారు. మంచి బస్సులు వేయాలని ఆర్ ఎం కు తెలిపారు.  విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉంటూ నాణ్యమైనది ఉండాలని ఎపిఇపిడిసియల్ అధికారులకు చెప్పారు. 
వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున  ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని డిసిపి సుమిత్

సునీల్ చెప్పారు. జివిఎంసి అధికారులు ఎప్పటికప్పుడు దేవస్థానం వారితో వివిధ అంశాలపై సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.  తాగునీరు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ కు జివిఎంసి అధికారులు తెలిపారు. 

డిసిపి సుమిత్ సునీల్ మాట్లాడుతూ దర్శనం పూర్తి అయిన తర్వాత ఎవరు ఏ మార్గంలో వెళ్లాలో సైనేజస్ బోర్డులు ఏర్పాటు

చేయాలన్నారు. ముగించే సమయానికి వరుసలలో ఎంత మంది ఉన్నారో అందరికీ దర్శనం జరగాలన్నారు. ఎసి బస్సులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు.  పలు అంశాలపై ఆయన సూచనలు చేశారు. 
     చందనోత్సవాల ఏర్పాట్లు పై ఇఓ సూర్యకళ మాట్లాడుతూ గత రెండేళ్లుగా చందనోత్సవాలు జరగనందు వలన ఈ యేడాది సుమారు 2 లక్షల మంది భక్తులు రావచ్చని

అంచనా వేసినట్లు వివరించారు.  ఉదయం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దర్శనానికి తలుపులు తెరచే ఉంటాయన్నారు. 
బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ చందనోత్సవాలు విజయవంత మయ్యేందుకు దేవస్థానం, పోలీసు, రెవెన్యూ శాఖ లు సహకారం అందించాలని తెలిపారు. దేవస్థానం బోర్డు సభ్యులు పలు సూచనలు చేశారు.  
ఈ సమావేశంలో శాసన

మండలి సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్,  జిల్లా జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్, అసిస్టెంట్ కలెక్టర్ అతిథి సింగ్, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, ఎసిపిలు పెంటారావు, తదితర పోలీసు అధికారులు, రెవిన్యూ, ఎక్సైజ్, అగ్నిమాపక శాఖ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam