DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎయులో జాబ్ మేళాకు లక్షలాదిగా పోటెత్తిన యువజన సందోహం 

*జాబ్ మేళాకు 2 రోజులు చాలవు 5 రోజులు పెట్టాలి: ఎయు వీసీ* 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 23 , 2022 (డిఎన్ఎస్):* గ్రేటర్ విశాఖపట్నం లోని  ఏయూ ప్రాంగణంలో  వైఎస్సార్‌సీపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్‌ మేళా లో పాల్గొనేందుకు నిరుద్యోగ యువత లక్షలాదిగా తరలి వచ్చారు. కేవలం 25 వేలమందికి కోసం

ఏర్పాట్లు చేయడం జరిగిదని, అయితే లక్షలాదిగా నిరుద్యోగ యువత తరలివచ్చింది నిర్వాహక కమిటీ ప్రతినిధి ఎయు ఉపకులపతి డా. పివిజిడి ప్రసాద్ రెడ్డి తెలిపారు. అయితే రిజిస్ట్రేషన్ కేవలం 75 వేలకే పరిమితం చేశామన్నారు. అయినప్పడికి రిజిస్ట్రేషన్ చేసుకొని వారు సైతం ఉప్పెనలా యువత తరలి వచ్చారన్నారు. ప్రధానంగా సాప్ట్వేర్, ఐటి,

డిటిపి, ఫార్మసీ, సెక్యూరిటీస్, హెల్త్, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ స్కూల్స్, ఇన్సూరెన్స్, బ్యాంకులు, మీడియా తదితర రంగాల్లో నియామకాలు జరుపుతున్నారు. నిర్వాహకులు ఊహించని విధంగా స్పందన లభించడంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. ఎయు లో ప్రస్తుతం వార్షిక పరీక్షలు జరుగుతున్నందున, ఈ మేళ పై ఎక్కువ దృష్టి పెట్టలేదని వీసీ

తెలిపారు. ఈ మేళ కోసం ఎయు లోని అన్ని విభాగాల తరగతి గదులను వినియోగిస్తున్నారు. ఆర్ట్స్ కళాశాల, సైన్సెస్, జర్నలిజం, ఇంజనీరింగ్ సహా అన్ని ప్రధాన తరగతుల గదులు నిరుద్యోగ యువతతో కళకళలాడుతున్నాయి. 

ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ వి. విజయ సాయిరెడ్డి, రాష్ట్ర ఐటి మంత్రి గుడివాడ అమర్ నాధ్, తదితరులు

పాల్గొన్నారు. 

కార్యక్రమాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతకు మెరుగైన జీవితం కల్పించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పని చేస్తున్నారు. ప్రభుత్వం రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించాలని సీఎం భావిస్తున్నారు. జాబ్ మేళా

అనేది నిరంతర ప్రక్రియ. చదువుకున్న ప్రతి వ్యక్తి నిరుద్యోగిగా మిగుల కూడదు అనేది సీఎం లక్ష్యం.

గత వారం తిరుపతి లో నిర్వహించిన మేళ కు లభించిన స్పందన ఆదర్శంగా విశాఖలోనూ జనం భారీగా పాల్గొనడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం పెల్లుబికింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam