DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హనుమాన్ చాలీసా పాడతా అన్నందుకు ఎంపీ నవనీత్  అరెస్ట్

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 24 , 2022 (డిఎన్ఎస్):* మహారాష్ట్ర లో హిందూ వ్యతిరేక పాలన కు పరాకాష్ట సన్నివేశం ఆదివారం ముంబై లో జరిగింది. స్వతంత్ర ఎంపీ సినీ నటి నవ్ నీత్ కౌర్, ఆమె భర్త స్వతంత్ర ఎమ్మెల్యే రవిలను ముంబై పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టు లో ప్రవేశ పెట్టారు. దీనికి ప్రధాన కారణం వారిద్దరూ

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ఇంటి ముందు ( మాతోశ్రీ )  హనుమాన్ చాలీసా పాడుతాం అని ప్రకటించడమే. నాసిక్ పోలీసులు మసీదు లకు 100 మీటర్ల దూరం లో ఎటువంటి హిందూ భక్తి గీతాలను ఆలపించకూడదు అని ఆదేశాలు అమలు చేసిన నేపధ్యం లో మహారాష్ట్ర అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆదివారం ముంబైలో హైటెన్షన్ నెలకొంది. శనివారం అరెస్ట్ చేసిన

వీళ్ళిద్దరిని బాంద్రా కోర్టు లో ఆదివారం ప్రవేశ పెట్టారు. కోర్టు ఎదుట నవ్ నీత్ కౌర్ హనుమాన్ చాలీసా ప్రచారం చేస్తామని ప్రకటించారు. ఈ రాష్ట్రంలో హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యడమే నేరంగా ఉందని మండిపడ్డారు. మహారాష్ట్రలో హనుమాన్ జయంతి. సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే హనుమాన్ చాలీసాను పఠించాలని నిరసనలు

వెల్లువెత్తాయి. సీఎం హనుమాన్ చాలీసా పఠించకపోతే తామే సీఎం ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ రాణా.. ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి శివసేన కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఎంపీ నవనీత్ కౌర్ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు

తరలించారు.

పోలీసులు తమను అరెస్టు చేయడం పట్ల నవనీత్ కౌర్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమీ ఉగ్రవాద చర్యలకు పాల్పడటం లేదని, సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని మాత్రమే చెప్పామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఎం ఇంటి ముందు ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వినిపించుకునే

ప్రయత్నం చేయలేదు. దీంతో ముంబైలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నవనీత్ ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తలు మాతోశ్రీ కి భారీ ఎత్తున చేరుకున్నారు.

ఇప్పడికే మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే మసీదుల్లో మైక్ లు తొలగించాలని, లేని పక్షంలో ప్రతి మసీదు ఎదుట లౌడ్ స్పీకర్లు పెట్టి మరీ హనుమాన్ చాలీసా

వినిపిస్తామని చేసిన ప్రకటనతో హిందూ ఉద్యమం ఊపందుకున్న విషయం తెలిసిందే.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam