DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ హైకోర్టు జడ్జిచే మహిళ సంఘాలకు ఋణాలు పంపిణి  

*(DNS Report : P Raja, Bureau Chief, Amaravati)*

*అమరావతి, ఏప్రిల్ 25, 2022 (డిఎన్ఎస్):* ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ జడ్జి మరియు ఏ పి రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పర్యటన లో భాగం గా జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉపకరణలు పంపిణీ, ఋణాల చెక్కు పంపిణీ చేశారు.

 వైయస్ఆర్ క్రాంతి పథం ద్వారా రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామ సమైఖ్య పరిధిలో ఉన్న లక్ష్మిసాయి,  రామ్ సాయి, వినాయకుడు,  అరుణ , జై భవాని,  వినాయకుడు,  ధనలక్ష్మి, మౌనిక స్వయం సహాయక సంఘాలకు  ఒక్కొక్క సంఘానికి రు.20 లక్షలు చొప్పున రూ. 1,60,00,000 ల బ్యాంకు లింకేజి చెక్కును అందజేశారు. మెప్మా కి చెందిన మహిళా సంఘాలకు రు.1.75 కోట్ల

బ్యాంకు లింకేజి చెక్కు అందచేశారు.

గురుదేవా ఛారిటబుల్ ట్రస్ట్, విజయనగరం ఆధ్వర్యంలో 34 మంది దివ్యంగులకు రెండు లక్షలు పైగా ఖరీదు చేసే  ఉపకరణాలు ట్రై సైకిల్స్ 3, క్రచేస్ 3 జతలు, లింబ్ ఒకటి, హియరింగ్ పరికరాలు 9, ఎల్ బౌ స్టిక్స్ 4 లను ఉచితంగా అందచేశారు.

తొలుత సభా ప్రాంగణానికి చేరుకున్న జస్టిస్ అషానుద్దీన్

అమానుల్లా గిరిజన  సంప్రదాయ నృత్యాలతో గిరిజనులు స్వాగతం పలికారు. వీరితో పాటు గా  న్యాయమూర్తులు, అధికారులు స్వాగతం పలికారు. సభా ప్రాంగణంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా , గిరిజన సంక్షమశాఖ, నగరపాలక సంస్థ, తదితర శాఖల ఆధ్వర్యలో ఏర్పాటు చేసిన ఎగ్జిభిషన్ స్టాల్స్ ను జస్టిస్ ప్రారంభించి సందర్శించడం

జరిగింది.

ఈ సందర్భంలో జిల్లా ప్రధాన న్యాయ మూర్తి, జిల్లా న్యాయ సేవా ధికర సంస్థ - ఛైర్మన్  పి. వెంకట జ్యోతిర్మయి, రాష్ట్ర డిఎస్ఎల్ఏ కార్యదర్శి ఎమ్. బబిత, సీనియర్ సివిల్ జడ్జి కం జడ్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ - సెక్రెటరీ కె. ప్రత్యుషకుమారి, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, ఎస్పీ

ఐశ్వర్యరాస్తోగి, వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్ లు ఇలాక్కియా, జీ. సూరజ్ ధనుంజయ్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్లసుబ్బారావు, డిఆర్ఓ సత్తిబాబు, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, డి ఎల్ ఎస్ ఏ అధికారులు పలువురు జడ్జి లు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam