DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వరాహ లక్ష్మి నృసింహునికి చందనం అరగతీత మొదలు 

*సింహాచల క్షేత్రంలో వైభవంగా చందనయాత్ర వేడుకలు ఆరంభం*   

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 26 , 2022 (డిఎన్ఎస్):* అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో తొలి విడత చందనం అరగతీత కార్యక్రమం తో అక్షయ

తృతీయ వేడుకలు ఆరంభమయ్యాయి. చైత్ర బహుళ ఏకాదశి పర్వదినాన మంగళవారం ఉదయం గర్భాలయం లో ప్రత్యేక ఆరాధనలు అనంతరం మేలిమి చందన చెక్కలను స్వామికి సమర్పణ చేసి, స్వామి అనుమతి తో చందనము చెక్కలకు తొలుత విష్వక్సేన ఆరాధన,  పుణ్యాహవాచనం, ఆరాధన పూర్తి  చేసి ఆలయ బేడా మండపంలో ప్రదక్షిణ లు నిర్వహించారు. అర్చక, వేదపండితులు పంచ సూక్త

పఠనం చేస్తుండగా చందనం అరగతీత ను ఆలయ అర్చకులు ప్రారంభించారు. 

ఆలయ స్థానాచార్యులు డా. టిపి రాజగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ ఇంచార్జి ప్రధాన అర్చకులు ఇరగవరపు వెంకట రమణమూర్తి, తదుపరి ఉప ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ప్రసాద్ ఆచార్యులు ఆలయ పురోహితుడు, అలంకారి కరి

సీతారామాచార్యులు చందాన అరగతీతలో పాల్గొన్నారు. 

తదుపరి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, తదితరులు కూడా అరగతీతలో పాల్గొన్నారు.   

మే 3 న వరాహ నృసింహుని నిజరూపదర్శనం ఉత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఏడాది పొడవునా 500 కిలోల సుగంధభరిత చందంలో ఉండే స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే

భక్తులకు తన నిజరూప దర్శనం గావిస్తారు. దీనినే భక్తులంతా చందనోత్సవం గా, చందనయాత్ర గా పిలవడం జరుగుతుంది. తొలి విడతగా 125 కిలోల చందనాన్ని అక్షయ తృతీయ మరునాడు స్వామికి సమర్పణ చేస్తారు. 

అత్యంత ప్రధానమైన ఈ తొలిచందన అరగతీత వేడుకల్లో ఆలయ ఈఓ ఎం వి సూర్యకళ, చందనయాత్ర ప్రత్యేక అధికారిని డి. భ్రమరాంబ గానీ

పాల్గొనకపోవడం గమనార్హం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam