DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీని ఆశీర్వదించకపోయినా ఏపీకి అండగా బీజేపీ, మోడీ నిలిచారు

*ఉత్తరాంధ్రకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇవే..*

*బీజేపీ ఉత్తరాంధ్ర జోనల్ మీట్ లో దగ్గుబాటి ధూమ్ ధామ్ ప్రసంగం* 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 27, 2022 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు బీజేపీ కి ఓట్లు వేసి ఆశీర్వదించకపోయినా బీజేపీ, నరేంద్ర మోడీ లు ఏపీ కి

అండగా నిలిచారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రకటించారు. బుధవారం విశాఖనగరం లోని విశాఖపట్నం పోర్ట్ కళావాణి ప్రాంగణం లో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఉత్తరాంధ్ర జిల్లా జోనల్ సమావేశానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు బీజేపీ గొప్పతనాన్ని

ప్రకటించినట్టుగా అనిపించినా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను ఎద్దేవా చేసినట్టుగానే అనిపించాయి. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ పట్ల ప్రజల్లో విశ్వాసం, కృతజ్ఞతా ఉన్నాయని, అందుకే రెండు పర్యాయాలు వరుసగా అత్యధిక మెజారిటీ సీట్లు గెలిపించి బీజేపీ కి కేంద్రం లో అధికారం కట్టబెట్టాయన్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్

లో ఓటర్లు మాత్రం బీజేపీ కి ఏనాడూ మద్దతుగా నిలవక పోయినా కేంద్రంలోని బీజేపీ మాత్రం ఏపీ కి ఎన్నో ప్రోజక్ట్ లు ఇచ్చిందని, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర లో ఎన్నో ప్రాజెక్ట్ లు కేటాయించిందని, జాతీయ రహదార్లను 8 లైన్లు గా మార్చిందని, కోరోనా కష్ట కాలం లో సైతం ప్రజలకు అండగా నిలిచి ఉచిత బియ్యం, విశాఖ ప్రాంతంలో పర్యాటక ప్రాంతానికి

ప్రత్యేక నిధులు, అరకు లోయ కు విస్తాడోమ్ రైలు బోగీలు, దేవాలయాల వద్ద యాత్రీకుల వసతులకై ప్రసాద్ పథకం, ప్రత్యేక రైల్వే జోన్, జాతీయ విద్య సంస్థల ఏర్పాటు, వీటికి శాశ్వత భవనాలకై స్థలం ఇవ్వవలసిన రాష్ట్రం నోరెత్తక పోయిన 7 సంవత్సరాల విద్య సంవత్సరాలను పూర్తి చేశామన్నారు. 

ఇటీవల జరిగిన 5 ఉత్తరాది రాష్ట్రాల

ఎన్నికల్లో కార్యకర్తల పరిశ్రమ వల్లే 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిందన్నారు. నాయకుల ప్రభావం కొంతే ఉంటుందని, అధిక శ్రమ కార్యకర్తలదేనన్నారు. బీజేపీ పట్ల దేశ ప్రజల్లో అత్యంత ఆదరణ ఉందని అనడానికి నిదర్శనం ఉత్తర ప్రదేశ్ ఎన్నికలే అన్నారు. యుపి లో వరుసగా రెండు సార్లు గెలిచినా పార్టీ కేవలం యోగి సారధ్యంలోని బీజేపీ

మాత్రమే అన్నారు. 

త్రిపుర లో బీజేపీ కి ఏమాత్రం సభ్యత్వం లేదని, ప్రజల్లో నమ్మకం కూడా లేదని, అలాంటి చోట బీజేపీ కార్యకర్తలు అత్యంత శ్రమకోడ్చి పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లి, శాసన సభ ఎన్నికల్లో పార్టీ కి అత్యంత మెజారిటీ సీట్ల

గెలిపించగలిగారన్నారు.

రాష్ట్రాల్లో పూర్తి స్థాయి అభివృద్ధి జరగాలి అంటే కేంద్రం లోను, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారం ఉండాలన్నారు. తద్వారా అంతర్గత సమన్వయం ఉంటుందన్నారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారం లో ఉండడంతో రాష్ట్రాలకు కేటాయించిన నిధులను స్థానిక రాష్ట్రాల్లో అధికార పార్టీలు వీటిని తమ

ఖాతాల్లోకి వేసుకుని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయన్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ ని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసేందుకే విస్తృతంగా అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. 

2014 లో సబ్ కె సాథ్ సబ్ కా వికాస్ అనే నినాదం తో ఎన్నికలకు వెళ్లాం, ప్రజల ఆశీర్వచనం తో 282 లోక్ సభ స్థానాల్లో విజయం

సాధించామన్నారు. 
 
తదుపరి 2019 లో సబ్ కె సాథ్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ అనే నినాదం తో ఎన్నికలకు వెళ్లాం. నరేంద్ర మోడీ కి గ్రాఫ్ తగ్గింది అని విశ్లేషకులు భావించిన సందర్భంలో 303 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించామన్నారు. దేశంలో సమస్యల్లో కీలకమైనది కొరోనా ఒకటి, దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని, పీపీఈ కిట్లు,  మాస్క్

లు, ఆక్సిజెన్ సిలండర్లు, మందులు, వెంటిలేటర్లు, టీకాల పంపిణీ ల్లో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఘనత నరేంద్ర మోడీ దేనన్నారు. 

ఈ ఘనత దేశ ప్రజలదే. . .:

ఆయన ఈ ఘనత దేశ ప్రజలు అందరి కృషి అని సబ్ కె సాథ్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనే కితాబు ను  నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఈ విజయాన్ని

ప్రజలకే అప్పగించారన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేకించి ఉత్తరాంధ్ర జిల్లాలకు కేటాయించిన నిధులు, ప్రాజెక్ట్ లను కొన్నింటిని వివరించారు.

భారత్ మాల ప్రాజెక్ట్ లో భాగంగా జాతీయ రహదారి 16 రోడ్ల విస్తరణలో   

1 . రూ. 1467 కోట్ల నిధులతో ఆనందపురం నుంచి రణస్థలం వరకు రోడ్డు

విస్తరణ 
2 . రూ. 1423 కోట్ల నిధులతో రణస్థలం నుంచి నరసన్నపేట  వరకూ రోడ్డు విస్తరణ  
3 . రూ. 563 కోట్ల నిధులతో నరసన్నపేట నుంచి ఇచ్చాపురం వరకూ  రోడ్డు విస్తరణ జరిపారన్నారు. 

శ్రీకాకుళం లో 9292 ఇళ్ళకి అమృత్ పధకం తో నీటి సదుపాయం ఇచ్చారని, రోడ్లు కోసం 80 కోట్లు కేటాయించారు. శ్రీకాకుళం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం

ద్వారా 1 ల 80 వేలకు ఇళ్లను కేటాయించారన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పధకం ద్వారా 
 3 లక్షల 18 వేల మంది రైతులకు రూ. 6 వేల నిధులు ఇచ్చామన్నారు. 100 కిమి ల పరిధిలోనే గ్రామాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించామన్నారు. 

పార్వతీపురం జిల్లాలో : గిరిజన వర్శిటీ సాలూరు లో ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది
హైవె

 సాలూరు నుంచి జక్కువ, కార్లం దగ్గర భారత్ మాల ప్రాజెక్ట్ 13 కోట్ల నిధులు కేటాయింపు

అరకు జిల్లా లో: అల్లూరి సీతారామరాజు జిల్లా లో కేంద్ర నిధులతో విస్టాడోమ్ బోగీలు ఇచ్చామన్నారు. అజ్ఞాత పోరాట యోధులు (అన్ సంగ్  హీరోస్) మన్యం నుంచి పాల్గొన్న వారి కోసం లంబసింగి లో ఒక మ్యూజియం

ప్రారంభిస్తోందన్నారు.

కొత్తవలస -రైల్వే లైన్లు 1414 కోట్ల నిధులతో డబ్లింగ్ ప్రాజెక్ట్ కేటాయింపు జరిపామన్నారు. 

విజయనగరం జిల్లాలో 112718 మందికి ఇళ్లను కేటాయింపు జరిపామని, రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన అమలు, 19639 మంది ఇళ్ళకి అమృత్ పధకం అమలు. 

అనకాపల్లి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియమ్

ఎనర్జీ వర్సిటీ ( ఐఐపిఈ ) ని అనకాపల్లి సబ్బవరం లో స్థాపించాలి అని కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. దీనికి భూమి ని రాష్ట్రం కేటాయించాలి. ఇంకా ఇవ్వలేదు. అయినా తరగతులను మూడేళ్ళుగా విశాఖలోనే నిర్వహిస్తున్నామన్నారు. 

పెందుర్తి ఆనందపురం, 2527 కోట్ల నిధులు రోడ్లు కేటాయింపుకి

దువ్వాడ రైల్వే అభివృద్ధి కి

కేంద్రం కేటాయింపులు

విశాఖ నగరం ను స్మార్ట్ సిటి గా మొట్ట మొదటి కేటాయింపుల్లోనే స్థానం కల్పించారు. 

కేంద్ర ప్రభుత్వ  సంస్థలు : ఐఐఎం, సమీర్, మెడ్ టెక్ సిటీ,  విశాఖ చెన్నై కారిడార్ నిర్మాణం కోసం రోడ్ల అభివృద్ధి, పోర్ట్ రోడ్డు ను 4 రోడ్లను అభివృద్ధి.

రైల్వే జోన్ ఏర్పాటు ను ఖరారు

చేసిందన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి ప్రకటించారన్నారు.  
 
విశాఖ లో జరిగిన ఈ మొదటి జోనల్ సమావేశంలో భారతీయ జనతా పార్టీ జాతీయ సహా సంఘటన మహామంత్రి శివ ప్రకాష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర అధికార

ప్రతినిధి సుహాసిని ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. 

ఈ సమావేశంలో శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అరకు (మన్యం), అనకాపల్లి జిల్లాలకు చెందిన బీజేపీ మండలాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam