DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పురాణం కాలం నుంచే అవయవదానం ఉంది : జెడి లక్ష్మీనారాయణ

రక్తదాన, అవయవ దానాల పై పాఠ్యాంశాలు పెట్టాలి 

విశాఖపట్నం, ఆగస్టు 9 ,2018 (DNS Online ):  à°…వయవాలను దానం చెయ్యడం ద్వారా ప్రతి మనిషి మరో జీవితాన్ని పొందవచ్చని, అవయవ దాన

ప్రక్రియ పురాణ కాలం నుంచే ఉందని, దీనికి నిదర్శనమే వజ్రాయుధం అని సీనియర్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. గురువారం

విశాఖపట్నం నగరం లోని ద్వారకానగర్ లో గల పౌరగ్రంధాలయం లో స్పెక్ట్ సంస్థ నిర్వహించిన అవయవదాన అవగాహనా సదస్సులో అయన ముఖ్య ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా అయన

మాట్లాడుతూ తానూ ఈ సదస్సులో మాట్లాడేందుకు ఐదు అర్హతలున్నాయని, తానూ ఇంతవరకూ 55 సార్లు రక్తదానం చేశానని, ఐదేళ్ల క్రితమే అవయవ దాన పత్రాలపై సంతకం చేశానని,

శ్రీకాకుళం జిల్లాలో సహాలలాపుట్టుగ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు తెలిపారు. ప్రతి నెల ఒక్క రోజు ఆ గ్రామం లో బస చేసి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి

కార్యక్రమాలు, విద్య, వైద్యం, ఉపాధి తదితర అంశాలపై పర్యవేక్షణ జరుపుతున్నట్టు తెలియచేసారు. 

పురాణ ఆధారాలు...
దేవ దానవ యుద్ధం లో ఇంద్రునికి ఆయుధం అవసరం

కావడంతో దధీచి అనే మహర్షి ని కలిసి తమకు సహకరించవలసింగా కోరడం జరిగింది. దధీచి మహర్షి తన వెన్నుముకను తొలగించి ఒక బృహత్తర ఆయుధాన్ని తయారు చేసి ఇచ్చారు. దాని

పేరే వజ్రాయుధం అని తెలిపారు. శిబి చక్రవర్తి - పావురం కదా ప్రతి ఒక్క ఆంధ్రునికీ తెలిసిందేనని, ఒక పావురం బరువు తూచేందుకు శిబి చక్రవర్తి తన తొడ నుంచి మాంసాన్ని

కోసి ఇచ్చిన ఘటన అందరికీ తెలుస్తోందన్నారు. 

పాఠ్యాంశాలుగా చేర్చాలి.. :

రక్తదాన, అవయవ దాన అవగాహనా వివరాలను ఎనిమిదవ తరగతి నుంచి పాఠ్యాంశంగా చేర్చాలని

కోరారు. తద్వారా వారికి 18 ఏళ్ళ వయసు వచ్చేనాటికి స్వచ్చందంగా రక్త దానం చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇటీవల ప్రతి నగరం, పట్టణం లో విద్య సంస్థలు ఎక్కువగానే ఉన్నాయని,

ప్రతి నెల ఒక్కొక్క కళాశాల విద్యార్థులు రక్తదాన శిబిరం నిర్వహించినట్టయితే ఆయా నగరాల్లో రక్త నిల్వల లోటు ఉండదన్నారు.   à°ˆ సమావేశం లో విజయ్ నిర్మాణ్ సంస్థ

అధిపతి ఎస్. విజయ్ కుమార్, స్పెక్ట్ ప్రతినిధి గూడూరు సీత లక్ష్మి, డాక్టర్ బి. రామ మోహన్, డాక్టర్ ఎం బి సుజాత, చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్. కనకవల్లి, తదితరులు

పాల్గొన్నారు. 

 

#dns   #dnsnews   #dns news  #dnslive  #dns live  #dnsmedia   #dns media  #visakhapatnam  #vizag  #cbi jd  #lakshminarayana   #political   #ips lakshminarayana #vvl ips  #Organ donors

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam