DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచల చందన యాత్ర కు ప్రజా రవాణా సంస్థ విస్తృత ఏర్పాట్లు 

*సింహాచలం కు 170 బస్సులు, కొండపైకి 56 ఆర్టీసీ బస్సుల సేవ*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 1, 2022 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం, సింహాచలం లో వైశాఖ శుక్ల తదియ నాడు (మే 3 న ) జరిగే స్వామి నిజరూప దర్శనం కోసం 170 ప్రత్యేక

బస్సులను నడుపుతున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ ప్రజా రవాణా సంస్థ విశాఖ జిల్లా అధికారి తెలిపారు. అదే విధంగా సింహాచలం కొండ క్రింద నుంచి కొండ పైకి 56 ఉచిత బస్సులను కూడా నడుపుతున్నట్టు తెలియచేసారు. వివిధ జిల్లాల నుంచి సింహాచల క్షేత్రం కు చేరుకునేందుకు యాత్రీకుల సౌకర్యం కోసం ఈ బస్సులను నడుపుతున్నట్టు తెలిపారు.

  

తెల్ల వారి విశాఖ నగర నలుమూలల నుండి అదనంగా 170 ప్రత్యేక బస్సుల ను APPTD, విశాఖ జిల్లా వారు నడపనున్నారు. ప్రత్యేక బస్సుల యొక్క వివరములు : 

1. శ్రీకాకుళం నుండి సింహాచలం అడవివరం) కు 10 బస్సులు.

2. విజయనగరం నుండి సింహాచలం అడవివరం) కు 20 బస్సులు. 

3. పాత పోస్ట్ ఆఫీస్ /ఆర్. కే. బీచ్ నుండి

సింహాచలం( అడవివరం ) కు 20 బస్సులు.

4. తగరపువలస భీమిలి నుండి సింహాచలం(అడవివరం) కు 10 బస్సులు. 

5. మారికవలస/ PM. పాలెం నుండి సింహాచలం(అడవివరం) కు 15 బస్సులు.

6. అనకాపల్లి నుండి సింహాచలం( గోశాల) కు 10 బస్సులు. 

7. కొత్తవలస / దేవరపల్లి నుండి సింహాచలం(గోశాల) కు 15 బస్సులు.

8. చోడవరం/

మాడుగుల/కొత్తకోట నుండి సింహాచలం ( గోశాల) కు 20 బస్సులు, 

9. గాజువాక /సింధియా నుండి సింహాచలం ( గోశాల) కు 20 బస్సులు. 

10. ఆర్ టి సి కాంప్లెక్స్/పాత పోస్ట్ ఆఫీస్ /ఆర్. కే. బీచ్ నుండి సింహాచలం(గోశాల-) కు 20 బస్సులు. 

11. నర్సీపట్నం నుండి సింహాచలం( గోశాల)కు 10 బస్సులు..

అన్ని పాయింట్లలో అధికారులను

సిబ్బందిని నియమించుట జరిగింది.

గోశాల నుండి కొండ పైకి  మరియు అడవివరం నుండి కొండ పైకి మొత్తం 56 ఉచిత బస్సులను భక్తుల సౌకర్యార్థం సింహాచలం దేవస్థానం వారు ఏర్పాటు చేసారని విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ అప్పల రాజు తెలియ చేస్తున్నారు. 

ఆర్టీసీ అందిస్తున్న ఈ అవకాశమును భక్తులు

వినియోగించుకోవలసినదిగా విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి కోరుతున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam