DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్యం సత్యం . . పున: సత్యం భగవద్రామానుజో జగద్గురు. . 

*భగవద్రామానుజుల తిరునక్షత్రం సందర్భంగా ప్రత్యేక కథనం* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 5, 2022 (డిఎన్ఎస్):*  గురువులు అందరికి ఉంటారు. అయితే  జగత్తు లోని అందరికి కలిపి ఉండేది ఒక్కరే గురువు వారే జగద్గురువు. సమాజానికి ఏది మంచిదో. ., తెలియచేయడంతో పాటు వారి

జీవితాలను పరమపదానికి చేర గలిగే మార్గాన్ని సూచించేవారిని మాత్రమే జగద్గురువు అని పిలవాలి. అలంటి మార్గాన్ని  ఈ లోకానికి అందించిన వారు సాక్షాత్ భగవద్రామానుజులు మాత్రమే. అందుకే వారికి మాత్రమే జగద్గురువులు అని స్థాయి అందించింది ఈ సమాజం. దీనికి ఎన్నో దృష్ఠ్యంతలు ఉన్నాయి. అందుకే వారి గురించి ఎందరో మహానుభావులు, జ్ఞాన

సంపన్నులు అందించిఞ్చ నిత్యా సత్యం ఇదే. ..

"సత్యం సత్యం పునఃసత్యం యతిరాజో #జగద్గురుః! 
సయేవ సర్వలోకానాం ఉద్ధర్తా నాస్తి సంశయః!"

మే 5 న భగవద్రామానుజులు. .. వారి తిరునక్షత్రం ( జన్మ దినం ) సందర్భంగా ప్రత్యేక కథనం 

తానూ ఒక్కరే పరమ పదానికి వెళ్ళకూడదు అని. సమాజంలోని ప్రతి ఒక్కరూ

శ్రీమవిష్ణువు సాన్నిత్యాన్ని పొందాలి అనే మహా సంకల్పంతో తన గురువులు గోష్ఠీపూర్ణులనే తిరుక్కోట్టియార్‌ నంబి తనకు అత్యంత గోప్యంగా ఉపదేశం చేసిన అందించిన శ్రీ అష్టాక్షరీ మహా మంత్రాన్ని గోష్టీపురం లోని గుడి  గోపురం  ఎక్కి మరి సామాన్య ప్రజలకు అందించిన మహోన్నతులు. దీంతో వారి గురువుల ఆగ్రహానికి సైతం లోనయ్యారు. daaniki

రామానుజులు తెలిపిన వివరణ ఒక్కరే. . .నేను నరకానికి పోయినా పరవాలేదు. సమజయంలోని ప్రతి ఒక్కరూ వైకుంఠానికి చేరాలి అన్నదే మా సంకల్పం అని. ఎంతో సంబరపడింది గురువులు వీరికి  ఎంబెరు మానారే. . . ( ఎంతో ఉన్నత స్థితికి చేరావు ) అని పిలిచారు. నాటి నుంచి వారు ఎమ్బెరుమానార్ అయ్యారు. 

సమాజం లోని సాంఘిక భేదాలను తొలగిస్తూ

అన్ని వర్ణాల వారినీ ఆలయంలో మూలవిరాట్ దర్శనం కల్పిచేందుకు పెద్ద పోరాటమే చేశారు. ఎందరి నుంచో విభేదాలు కూడా ఎదుర్కొన్నారు. అయినప్పడికే తానూ సంకల్పించిన సమానత కోసం సామాన్యుల నుంచి అసామాన్యులు వరకూ అందరిని కలుపుకుంటూ వెళ్లి   విశిష్టాద్వైత  సంప్రదాయాన్ని విస్తరణ చేసారు. పంచ సంస్కారాలతో అష్టాక్షరీ మంత్రంతో ప్రతి

ఒక్కరి జీవితాన్ని ఉద్ధరించే విధంగా మార్గదర్శకం చేసారు. 

వారు సమాజంలో అందరి సమానతనూ కోరుకున్నారు. ఆ విధంగా ప్రచారం చేశారు కనుకనే  అపరరామానుజులుగా ఖ్యాతి గాంచిన చిన్న జీయర్ స్వామి వారు  216  అడుగుల భగవద్రామానుజుల విగ్రహాన్ని తమ ఆశ్రమంలో ఏర్పాటు చేశారు. దాటి పాటు వారు ప్రచారం చేసిన సమాజ సంస్కరణలను

తెలియచేసే విధంగా ప్రదర్శన శాలను, శ్రీవైష్ణవ సంప్రదాయం లో మహా విష్ణువును కీర్తిస్తూ ఆళ్వార్లు దర్శించిన 108 దివ్యదేశాలను అక్కడే ప్రతిష్ఠా చేసారు.    

ఇటీవలకాలంలో సగం విషయం పరిజ్ఞాన సంపన్నులు ఎక్కువగా పెరిగిపోతుండడంతో సనాతన ధర్మంలోని తమ ఆధిపత్యం కోసం చేసే కుప్పిగెంతుల కారణంగా సామాన్యుల్లో ఆవేదన

పెరుగుతోంది.  

రామానుజుల చరిత్ర ఇదే:..

విశిష్టాద్వైతమును విశ్వవ్యాప్తం చేసిన  ప్రతిపాదించిన రామానుజాచార్యుడు 1017 లో వైశాఖ మాస ఆర్ద్ర నక్షత్రం రోజున జన్మించారు. వీరు చేసిన ప్రచారం లో కీలకమైనవి..

సంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని

కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం. 

అన్నిటిలోకి రెండవది విశిష్టాద్వైత సిధ్ధాంతమ్ అత్యంత శ్రేష్టమైనది అని ప్రతిపాదించారు. 

తమిళనాడు లోని శ్రీ పెరంబుదూరుగా ఇప్పుడు పేరున్న భూతపురిలో జన్మించారు. శ్రీపెరంబుదూరు చెన్నై పట్టణానికి

సుమారు పాతిక కిలో విూటర్ల దూరంలో ఉంది. ఆయన తల్లి కాంతమతి, తండ్రి కేశవా చార్యులు. హరీత గోత్రం. ఆపస్తంబ సూత్ర యజుశ్శాఖా ధ్యాయులు. తండ్రి వద్దా, కాంచీపురంలోని యాదవ ప్రకాశకుల వద్దా ఆయన విద్యాభ్యాసం జరిగింది. విద్యాభ్యాస కాలంలోనే ఆయనలోని విశిష్టాద్వైత సిద్ధాంత విశ్వాసాలు వికాసం పొందాయి. గురువు తోనే భేదించి తన

విశిష్టాద్వైత వాదాన్ని నెగ్గించుకొన్న ప్రతిభాశాలి. ఆయనకు ముందు నుంచే విశిష్టాద్వైతం ఉంది. దానిని బహుళ వ్యాప్తిలోకి తీసుకొని రావడం రామానుజుల ఘనత. 

విశిష్టాద్వైతంలో ఉన్నతుడుగా ఉన్న యామునాచార్యుడు రామానుజుడిని విశిష్టాద్వైత ప్రచారానికి స్ఫూర్తి కల్గించారని తెలుస్తోంది. 

తిరుమంత్రాన్ని

ఉపదేశించిన తిరుక్కోట్టియార్‌ నంబి ఆదేశాన్ని కాదని ఒక ఆలయ గోపురం నుంచి తిరుమంత్రాన్ని అందరికీ వినపడేలా ప్రకటించారు. రామానుజులు బ్రహ్మ సూత్రాల శ్రీభాష్యం, వేదాంత సారం, వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగత గద్యం మొదలైన గ్రంథాలను రచించారు. దేశ వ్యాప్తంగా విశిష్టాద్వైతాన్ని ప్రచారం

చేయడానికి పలువురు సింహాసనాధిపులను, జియ్యంగార్లను, పరమై కాంతులను నియమించారు. చాత్తాద వైష్ణవులూ, అమ్మం గార్లూ శ్రీ వైష్ణవ దాసులు కైంకర్యం చేసే సంప్రదాయాలను ఏర్పరిచారు. అస్పృశ్యత లాంటి దురా చారాలను తొలగించడానికి సంస్కరణాత్మక పద్ధతులను ప్రవేశపెట్టారు. 

తన జీవితం ద్వితీయార్ధం శ్రీరంగంలో గడిపిన

రామానుజులు నూట ఇరవై సంవత్సరాలు జీవించి పుట్టిన సంవత్సరమైన పింగళలోనే మాఘ శుద్ధ దశమి శనివారం నాడు దేహ త్యాగం చేశారు. ఆయన జీవితానంతరం విశిష్టాద్వైతం ‘‘ద్రావిడ, సంస్కృతాల ప్రాబల్యాన్ని బట్టి తెంగలై, వడగలై అని రెండు శాఖలు ఏర్పడ్డాయి’’ అని తిరుమల రామచంద్ర ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రచురించిన ‘‘భార్గవ

పురాణం’’ గ్రంథానికి పరిష్కర్తగా రచించిన ‘‘ఆళ్వారాచార్యుల చరిత్ర తత్త్వం’’ వ్యాసంలో వ్రాశారు. (‘‘విశిష్టాద్వైతం’’ వివరణలో మరికొన్ని సైద్ధాంతిక విశేషాలు.)

తిరుమలలో ప్రత్యేక ఆరాధన ఏర్పాటు...

తిరుమలలోని మూలవిరాట్టు (ధ్రువబేరం) విష్ణుమూర్తి విగ్రహం కాదని, శక్తి విగ్రహమో, శివ

ప్రతిమో, సుబ్రహ్మణ్యమూర్తో కావచ్చని వివాదం చెలరేగింది. తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు వద్దకు శైవులు ఈ వివాదాన్ని తీసుకువెళ్ళి వాదించి తిరుమలలో జరుగుతున్న వైష్ణవ పూజలు ఆపుచేయించి శైవారాధనలకు అవకాశం ఇమ్మని కోరారు. పలువురు వైష్ణవుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజులు యాదవరాజు కొలువుకు వెళ్ళి

వాదించారు. శైవులతో జరిగిన వాదనలో పలు పౌరాణిక ఆధారాలను, శాస్త్ర విధానాలను సాక్ష్యాలుగా చూపి ఓడించారు. 

శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరారనీ, రామానుజులు వేంకటేశ్వరుని విగ్రహం ఎదుట బంగారంతో చేయించిన వైష్ణవాయుధాలు, శైవాయుధాలు, శక్తి ఆయుధాలు పెట్టి ఏ దైవానివైతే ఆ ఆయుధాలే స్వీకరించు అని ప్రార్థించి

తలుపులు మూశారని ప్రతీతి. రాత్రి అత్యంత కట్టుదిట్టాల నడుమ గడవగా తెల్లవారి తలుపులు తెరిస్తే ధ్రువబేరానికి శంఖ చక్రాలు ఆయుధాలుగా కనిపించాయంటారు. మొత్తానికి తిరుమలలోని మూలవిరాట్టు శ్రీనివాసుడేనని వాదన ద్వారా నిర్ధారించడంతో తిరుమలపై వైష్ణవ ఆరాధనలకు యాదవరాజు అంగీకరించారు.

అనంతర కాలంలో తిరుమలలో

కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు రామానుజులు ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు. తర్వాతి కాలంలో ఏకాంగి వ్యవస్థ జియ్యర్ల వ్యవస్థగా పరిణమించి స్థిరపడడంలోనూ రామానుజుల పాత్ర కీలకం. 

తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది రామానుజులే. ఆ ఆలయం చుట్టూ ఆలయ పూజారులకు అగ్రహారమిచ్చి, వీధుల నిర్మాణం

చేపట్టి యాదవరాజు తన గురువైన రామానుజును పేరిట రామానుజపురంగా రూపకల్పన చేశారు. అదే నేటి తిరుపతి నగరానికి పునాది అయ్యింది. 

రామానుజాచార్యులు తాను స్వయంగా పాంచరాత్ర ఆగమాన్ని పాటించే వ్యక్తి అయినా తిరుమలలో పరంపరాగతంగా వస్తున్న వైఖానస ఆగమాన్ని కొనసాగించారు. ఐతే అప్పటికి ఉన్న వైదికాచారాలతోపాటుగా

ద్రవిడవేదాలను, పాంచరాత్రాగమ ఆచారాలను కొన్నింటిని తిరుమల అర్చనా విధానంలో చేర్చారు. 

అంటరాని వారికి గుడిలో ప్రవేశం కల్పించడమే కాకుండా వారిని కైంకర్య సేవకు నియమించారు శ్రీ వైష్ణవ దాసులు (ఇతర వర్గాలకు చెందిన వైష్ణవ భక్తులు ), తిరుమలలోని పలు కీలకమైన వ్యవస్థల ఏర్పాటులో, మూర్తి స్వరూపనిర్ధారణలో, ఆగమ

పద్ధతుల్లో తిరుమల-తిరుపతిపైన రామానుజాచార్యునిది చెరగని ముద్ర.

వెయ్యేళ్ళ క్రితంనాడే సమాజంలో అంటరాని తనం ఉండకూడదు అని ప్రకటించి అందరికి ఆలయ ప్రవేశం చేయించిన వారు భగవద్రామానుజులు. నాడు ఆలయ ప్రవేశానికి దూరంగా ఉండిపోయిన ఆ సామాజిక వర్గాలు నేడు అదే ఆలయ వ్యవస్థను నిర్వహించే హోదాల్లో విధులు

నిర్వహిస్తున్నారు అంటే అది రామానుజుల కృపే.

అందరికి సమానత ను కల్పించారు కనుకనే రామానుజాచార్యులు జగద్గురువులు అయినారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam