DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీ వరాహ లక్ష్మి నృసింహుని చందన యాత్ర లో ఆర్టీసీ సేవలు మహోన్నతం

*అభినందనలపై డిఎన్ఎస్ మీడియా వార్తకు ఆర్టీసీ అధికారి ధన్యవాదములు*
 
*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 05, 2022 (డిఎన్ఎస్):* కోట్లాది మంది భక్తుల మనోవాంఛ సింహాచల క్షేత్రంలో వెలసిన  శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజరూప దర్శనం. వైశాఖ శుద్ధ తదియ రోజున ( మంగళవారం ) జరిగిన ఈ

ఉత్సవంలో విశాఖపట్నం లోని ప్రజా రవాణా సంస్థ ఏపీఎస్ ఆర్టీసీ అందించిన ఉచిత బస్సు సేవలను యావత్ భక్త జనం వేనోళ్ళ కొనియాడుతున్నారు. కొండ క్రింద నుంచి గుడి వరకూ ఉచితంగా మంగళవారం తెల్లవారు ఝామునుంచి అర్ద రాత్రి వరకూ బస్సులను ఉచితంగా నడిపి, లక్షలాది మంది భక్తులకు స్వామి దర్శనం లభించేలా సేవలు అందించారు. విశాఖ ప్రాంతీయ

అధికారి నుంచి క్రింద స్థాయి సిబ్బంది వరకూ అందరూ ఎంతో భక్తి శ్రద్దలతో విసుగు లేకుండా ప్రతి భక్తుణ్ణి ఆకట్టుకునే విధంగా సేవలు అందించారు. నేరుగా వాహన పార్కింగ్ కేంద్రం నుంచే ఉచిత బస్సులను నడపడంతో భక్తులు అందరికి ఎంతో సౌకర్యంగా ఉంది. ఇదే భావన ప్రతి ఒక్కరిలోనూ కలిగింది. 

సింహాచల క్షేత్రంలో జరిగిన చందన

యాత్రలో సామాన్య భక్తులను..  అందరూ అటు పొండి అనే వాళ్ళే. . .మీకు ఇటు ప్రవేశం లేదు. మీరు ఇటు రాకూడదు అనే వాళ్ళే కనిపించారు. కేవలం. APSRTC. శాఖ. సిబ్బంది మాత్రమే.  ఇటు రండి. .మా సేవలు తీసుకోండి .  స్వామీ వారి దర్శనానికి తీసుకు వెళతాం. అని ప్రతి భక్తుణ్ణి. పిలిచి మరీ ఆదరించారు.
భక్తుల కోసం నిస్వార్థ సేవ చేసిన ప్రభుత్వ శాఖల్లో.

ఆర్టీసీ మాత్రమే బెస్ట్ అనిపించారు. ఆఖరికి దేవస్థాన  సిబ్బంది కొందరు దర్శనానికి వెళితే ఒక అధికారి వారిపై చెయ్యి చేసుకున్నట్టు సమాచారం. వాళ్ళనే కొట్టిన వాళ్ళు సామాన్య భక్తులను ఆదరిస్తారా? అనిపించింది. 

ఉచిత బస్సుల్లో. ప్రతి భక్తుణ్ణి కొండపైకి తీసుకు వెళ్లారు. రాత్రి వరకూ బస్సులు నడిపారు.  ఇంతకీ. ఆ

బస్సుల డ్రైవర్లు,  సిబ్బంది స్వామి దర్శనం చేసుకున్నారో లేదో కూడా తెలియదు. కానీ ప్రతి భక్తునికి ఎంతో ఆనందాన్ని కల్గించారు. 
భక్తుల నుంచి వచ్చిన ఈ స్పందన పట్ల డిఎన్ఎస్ మీడియా లో వచ్చిన వార్తకు ఆర్టీసీ ప్రాంతీయ అధికారి అందరికి ధన్యవాదములు తెలియచేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam