DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హనుమాన్ చాలీసా ఐకాన్ నవనీత్ రాణా జైలు నుంచి ఆసుపత్రికి

*హనుమాన్ చాలీసా శివసేన ను భూస్థాపితం చేయనుందా?* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 05, 2022 (డిఎన్ఎస్):* ఎవరైనా భూత, ప్రేత సమస్యల్లో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చదివితే సమస్య పరిష్కారం కలుగుతుంది. అయితే అదే హనుమాన్ చాలీసా చదవడం శివసేన పార్టీని భూస్థాపితం చేయనుంది.

మహారాష్ట్రలో స్వతంత్ర్య ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులను హనుమాన్ చాలీసా పాడుతాం అన్నందుకు దేశ ద్రోహం కేసు పెట్టి జైల్లో పెట్టింది ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం. గత 12 రోజుల పాటు వేర్వేరు జైళ్లల్లో గడిపిన వీళ్ళిద్దరూ గురువారం జైలు నుంచి విడుదల అయ్యారు. అయితే వీళ్ళు చేసిన తప్పిదం ఏంటి అనే ప్రశ్నఇప్పుడు

శివసేన పార్టీ కి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. రాణా దంపతులు హనుమాన్ చాలీసా పాడడం విరమించుకున్నాం అని ప్రకటించిన తర్వాత కూడా ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం అరెస్ట్ చేయించి దేశ ద్రోహం పెట్టడం పై సొంత శివసేన పార్టీ నాయకులూ, కార్యకర్తలు సైతం మండిపడుతున్నారు. కాంగ్రెస్, ఎన్సిపి తో చెట్టాపట్టా వేసుకుని, మహారాష్ట్ర

హిందూ సింహం బాల సాహెబ్ స్థాపించిన శివసేన పార్టీ నేడు హిందూ వ్యతిరేక పార్టీగా మారిపోయింది అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళింది.

గత 12 రోజులుగా రాణా దంపతులు జైల్లో ఉండడంతో వాళ్ళు చేసిన తప్పిదం ఏంటనే ప్రశ్నకు మహా ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. జైలు నుంచి బుధవారమే విడుదల కావాల్సి ఉండగా, మహా ప్రభుత్వం కోర్టు

నుంచి పత్రాలు రాలేదు అనే సాకు చూపించి మరో రోజు అదనంగా ఇద్దరినీ జైలంలోనే ఉంచింది. హిందూ వ్యతిరేక పాలనా వ్యతిరేక విధానంగా మారింది అనే ప్రచారం విస్తృతంగా జరుగుతుండడంతో కాంగ్రెస్, ఎన్ సిపి లు శివసేనను ఒంటరిని చేసే ప్రయత్నం లో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో మహారాష్ట్ర లో స్థానిక ఎన్నికలు కూడా జరగనుండడంతో దీనికి తగిన

మూల్యం శివసేన చెల్లించే అవకాశం ఉంది. 

రాజకీయ అనుభవ రాహిత్యం కారణంగా ఉద్దవ్ థాక్రే తీసుకున్న నిర్ణయం కేవలం కొందరికే తెలిసిన రాణా దంపతులు ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. జైలు నుంచి విడుదలైన నవనీత్ రాణా ఆరోగ్యం క్షీణించడం తో నేరుగా లీలావతి ఆసుపత్రి లో చేరారు. ఆమెను చూసేందుకు మరో జైలు నుంచి

విడుదలైన వచ్చిన ఆమె భర్త రవి రాణా ని నవనీత్ చిన్న పిల్లలా ఏడవడం చూపరులను కన్నీటి పర్యంతం చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో, వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam