DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహా లో లౌడ్ స్పీకర్ల గొడవ రాజ్ థాక్రే అరెస్ట్ కు దారి తీస్తోందా?

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 07, 2022 (డిఎన్ఎస్):* మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తక్షణం తొలగించాలని మహా నవనిర్మాణ్ సేన చేస్తున్న ఉద్యమం సంస్థ అధ్యక్షుడు రాజ్ థాక్రే అరెస్ట్ కు దారి తీయనుందా అనే సంకేతాలు వెలువడుతున్నాయి. శనివారం ఉదయం న్యాయ నిపుణులు రాజ్ థాక్రే ఇంటికి

చేరుకోవడంతో ముందస్తు బెయిల్ కోసం చర్యలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించాలని లేని పక్షంలో ప్రతి మసీదు ఎదుట లౌడ్ స్పీకర్లు పెట్టి హనుమాన్ చాలీసా వినిపిస్తామని రాజ్ థాక్రే ప్రకటించిన నేపథ్యంలో మహారాష్ట్ర సహా కర్ణాటక, మధ్యప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో

కూడా ఈ ఉద్యమం ఉధృతం అయ్యింది. ఈ క్రమం లోనే ఎం ఎన్ సి నేత ఒకరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. ఇదే ఉద్యమం లో భాగంగా మద్దతు ప్రకటించి, మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించక పొతే తాము మహారాష్ట్ర ముఖ్యమంత్రు ఉద్దవ్ థాక్రే ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పడుతామని సవాల్ విసిరిన అమరావతి ఎంపీ నవనీత్ రాణా,

 ఎమ్మెల్యే రవి రాణా దంపతులను దేశ ద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేసి అకారణంగా 12 రోజులు జైల్లో పెట్టిన సందర్భంలో శివసేన పార్టీ కార్యకర్తలు సైతం చాలామంది ఉద్దవ్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam