DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్టీసీ కార్గో పార్సెల్ సర్వీసు బుకింగ్ ఏజెన్సీకి దరఖాస్తుల ఆహ్వానం

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 07, 2022 (డిఎన్ఎస్):* విశాఖపట్నం నగర పరిధిలో పలు ప్రాంతాల్లో కార్గో పార్సెల్ సర్వీసు బుకింగ్ ఏజెన్సీ తీసుకొనుటకు ఆసక్తి గల అభ్యర్ధుల నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ విశాఖపట్నం జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ. అప్పలరాజు  ఆహ్వానం

పలుకుతున్నారు. ఈ మేరకు విశాఖపట్నం డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేసారు. 

విశాఖ నగర పరిధిలో ఎం.వీ.పీ. కాలనీ, హనుమంతవాక జంక్షన్, ఈనాడు జంక్షన్, కార్ షెడ్, కొమ్మాది జంక్షన్, గాజువాక మార్కెట్, గాజువాక ఆటోనగర్ మరియు లంకెలపాలెం మొదలగు  ప్రాంతాలలో కేంద్రాల్లో ఏజెన్సీ లను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర

రోడ్ రవాణా సంస్థ ఆహ్వానిస్తోంది.  

కార్గో పార్సెల్ సర్వీసు బుకింగ్ ఏజెన్సీ తీసుకొనుటకు ఆసక్తి గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరడమైనది. కార్గో ఏజెంట్స్ కమిషన్ తే 01.05.2022 దీ నుండి 10% నుండి 15% వరకు పెంచడమైనది. కార్లో పార్సెల్ సర్వీసు బుకింగ్ ఏజెన్సీ నిర్వహించుటకు ఆసక్తి గల వారు ఈ అవకాశమును

వినియోగించుకోవలసిందిగా కోరుతున్నారు. పూర్తి వివరములు తెలుసుకొనుటకు జి. వి. సత్యనారాయణ, ఎ.టి.ఎం. (కమర్షియల్), విశాఖపట్నం (Ph 73311 47261) వారిని సంప్రదించవచ్చన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam